Dunith Wellalage Returns Sri Lanka From Asia Cup After Father Death
Dunith Wellalage : ఆసియాకప్ 2025లో శ్రీలంక జట్టు అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్-బి టాపర్‌గా సూపర్ 4లో అడుగుపెట్టింది. గురువారం అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) అర్థాంతరంగా జట్టును వీడి స్వదేశానికి(శ్రీలంకకు) పయనం అయ్యాడు.
ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌లో దునిత్ ఆడతాడా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.
విషాదం..
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ మరణించాడు. అతడు గుండెపోటుతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇన్నింగ్స్ విరామ సమయంలోనే ఈ విషయం శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిసినప్పటికి కూడా దునిత్ కు చెప్పలేదు.
No son should go through this💔
Jayasuriya & team manager right after the game communicated Dinuth Wellalage the news of his father’s passing away.pic.twitter.com/KbmQrHTCju
— Rajiv (@Rajiv1841) September 18, 2025
మ్యాచ్‌లో గెలిచిన తరువాత ఈ విషయాన్ని హెడ్ కోచ్ సనత్ జయసూర్య స్వయంగా 22 ఏళ్ల దునిత్‌కు చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే దునిత్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ వెంటనే అబుదాబి నుంచి అందుబాటులో ఉన్న విమానంలో శ్రీలంకకు బయలుదేరి వెళ్లాడు.
శనివారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తరువాత శ్రీలంక 23 పాక్‌తో, 26న భారత్‌తో తలపడనుంది. పాక్‌తో మ్యాచ్ నాటికి దునిత్ జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లుగా క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
దునిత్ తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలిసిన తరువాత పలువురు క్రికెట్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Deeply saddened by the passing of Mr. Suranga Wellalage, father of Dunith Wellalage. My heartfelt condolences to the family. Stay strong Dunith, the whole nation stands with you and your family in this difficult time.
May he attain the supreme bliss of Nibbana.🙏— Lasith Malinga (@malinga_ninety9) September 18, 2025
‘దునిత్ వెల్లగే తండ్రి సురంగ వెల్లగే మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ధైర్యంగా ఉండండి దునిత్. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం మీకు, మీ కుటుంబానికి తోడుగా నిలుస్తుంది.’ అని శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.