Asia Cup 2025 : ఆసియా క‌ప్‌లో ఆ ముగ్గురే గేమ్ ఛేంజ‌ర్లు.. వీరేంద్ర సెహ్వాగ్

సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలో భార‌త జ‌ట్టు

Asia Cup 2025 Sehwag Picks 3 Game Changers For India

Asia Cup 2025 : సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీలో భార‌త్ డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా అడుగుపెడుతోంది. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబ‌ర్ 10న త‌ల‌ప‌డ‌నుంది. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇప్పటికే ఈ మెగాటోర్నీలో పాల్గొనే భార‌త జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టులో అభిషేక్ శ‌ర్మ‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, జ‌స్‌ప్రీత్ బుమ్రాలు ఆసియాక‌ప్‌2025 లో భార‌త విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తార‌ని టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

WCL 2025 : మాజీ క్రికెట‌ర్లా.. మజాకానా.. డ‌బ్ల్యూసీఎల్ అరుదైన ఘ‌న‌త‌..

టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అత‌డు ఎల్ల‌ప్పుడూ కూడా మ్యాచ్ విన్న‌ర్ అని సెహ్వాగ్ అన్నాడు. ఇక యువ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ ఆట‌ను చూసేందుకు ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇక వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మిస్ట‌రీ స్పిన్ ఎలా ఉంటుందో ఇప్ప‌టికే చూశాం. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అత‌డు అత్యంత ప్ర‌భావ‌వంతంగా క‌నిపించాడు. అత‌డికి టీ20 ఫార్మాట్ ఇంకా బాగా క‌లిసివ‌స్తుంది. ఈ ముగ్గురు టీమ్ఇండియా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తారు అని సెహ్వాగ్ తెలిపాడు. ఆసియాక‌ప్ విజేత‌గా భార‌త్ నిలుస్తుంద‌ని జోస్యం చెప్పాడు.

Alex Hales : టీ20 క్రికెట్‌లో క్రిస్‌గేల్ రికార్డును స‌మం చేసిన అలెక్స్ హేల్స్‌..

ఆసియా క‌ప్ 2025 కోసం భార‌త జట్టు ఇదే..
సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.