ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (AGM) బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి వేరే ప్రదేశానికి మార్చాలని భారత్ కోరింది. ఈ అంశం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఆసియా కప్ 2025 టోర్నీ భవిష్యత్తుపైనా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డిమాండ్‌కు శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మద్దతు ప్రకటించాయి. ఏజీఎం జూలై 24, 25 తేదీల్లో ఢాకాలో జరగాల్సి ఉంది. అయితే BCCI భద్రతా, రాజకీయ కారణాలతో వేదికను మార్చాలని కోరింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు, ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నక్వీ దీనికి నిరాకరించడంతో.. భారత్ ఈ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించింది.
భారత్‌కు శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మద్దతుగా నిలుస్తుండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఢాకాలోని వేదికకు మద్దతు ఇస్తున్నాయి. ఈ సమావేశం చెల్లుబాటు కావాలంటే టెస్టులు ఆడే కనీసం మూడు దేశాల ప్రతినిధులు హాజరుకావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మద్దతు లభించటం కష్టమే.
Also Read: భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తాం: అమెరికా హెచ్చరిక
ఏసియన్ క్రికెట్ కౌన్సిల్‌లో ఫుల్ మెంబర్ నేషన్స్‌గా నేపాల్, యూఏఈ, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, హాంకాంగ్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ ఉన్నాయి. అసోసియేట్ మెంబర్లుగా బహ్రెయిన్, భూటాన్, కంబోడియా, తజికిస్థాన్, మాల్దీవులు, జపాన్, చైనా, మయన్మార్, ఇండోనేషియా ఉన్నాయి. వీటిలో చాలా దేశాల హాజరు ఇప్పటికీ అనిశ్చింగానే ఉంది.
సమావేశ వేదిక మారితేనే ఆసియా కప్ నిర్వహణ, మ్యాచ్ షెడ్యూలు వంటి కీలక నిర్ణయాలు జరగే అవకాశం ఉంది. లేకపోతే భారత్ ఏజీఎంను బహిష్కరించడంతోపాటు పాటు టోర్నీపై కూడా అనిశ్చితి కొనసాగుతుంది. జియోపాలిటికల్ అంశాలు విషయాన్ని మరింత జటిలం చేశాయి. ఈ వివాదం కేవలం క్రికెట్ పరమైనదే కాకుండా దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుంది.