IND vs AUS : 8, 10, 2, 0, 11, 6, 21, 3, 26, 5, 7 ఆసీస్ ఫోన్ నంబ‌ర్ చూశారా?

పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త బౌల‌ర్లు విజృంభించారు.

Australia 1st Innings score card in perth test viral

IND vs AUS : పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో న‌లుగురు అలెక్స్ క్యారీ (21), మిచెల్ స్టార్క్ (26), నాథన్ మెక్‌స్వీనీ (10), ట్రావిస్ హెడ్ (11) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన అంద‌రూ సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు.

ఉస్మాన్ ఖ‌వాజా (8), మార్న‌స్ ల‌బుషేన్ (2), స్టీవ్ స్మిత్ (0), మిచెల్ మార్ష్ (6), పాట్ క‌మిన్స్ (3), నాథ‌న్ లియోన్ (5) లు విఫ‌లం కావ‌డంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో త‌క్కువ ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు 46 ప‌రుగుల కీల‌క తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. హ‌ర్షిత్ రాణా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ రెండు వికెట్లు సాధించాడు. అంత‌క‌ముందు భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

Rishabh Pant : చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్.. డ‌బ్ల్యూటీసీలో ఒకే ఒక్క వికెట్ కీప‌ర్‌..

కాగా.. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా స్కోరు కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భార‌త బౌల‌ర్ల ధాటికి ఆస్ట్రేలియా త‌క్కువ ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన దాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఇది ఆస్ట్రేలియా ఫోన్ నంబ‌ర్ అంటూ 11 మంది బ్యాట‌ర్లు స్కోరు 8, 10, 2, 0, 11, 6, 21, 3, 26, 5, 7 వైర‌ల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో టీమ్ఇండియా పై ఆస్ట్రేలియాకు ఇది నాలుగో అతి త‌క్కువ‌ స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో 2023లో నాగ్‌పూర్ వేదిక‌గా 91 ప‌రుగుల‌కు ఆస్ట్రేలియా ఆలౌటైంది.

టెస్టుల్లో భార‌త్ పై ఆస్ట్రేలియా అత్య‌ల్ప స్కోర్లు..
మెల్‌బోర్న్‌లో 1981లో 83 ప‌రుగులు
నాగ్‌పూర్‌లో 2023లో 91 ప‌రుగులు
వాంఖ‌డేలో 2004లో 94 ప‌రుగులు
పెర్త్‌లో 2024లో 104 ప‌రుగులు
కాన్పూర్‌లో 1959లో 105 ప‌రుగులు

IPL Schedule : బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. ఒకేసారి మూడు ఐపీఎల్ సీజ‌న్ల షెడ్యూల్ విడుద‌ల‌!