Australia announce squads for India series no sign of Glenn Maxwell
AUS vs IND : ఈనెలలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం ఇప్పటికే భారత జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా సైతం టీ20, వన్డే సిరీస్‌లలో పాల్గొనే ఆసీస్ జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 సిరీస్‌లలో మిచెల్ మార్ష్ సారథ్యంలోనే భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.
వన్డే జట్టులో మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్‌లు రీ ఎంట్రీ ఇచ్చారు. గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ కు చోటు దక్కలేదు. గాయాల నుంచి వీరు ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణం.
ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్‌లో గాయం కారణంగా దూరమైన ఓవెన్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగనుండగా.. వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయిలో జట్టును ఎంపిక చేయగా, టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు మాత్రమే జట్లను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
Hikaru Nakamura : గెలిచిన గర్వమా..! గుకేష్ ‘కింగ్’ను విసిరేశాడు.. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. ?
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
https://t.co/8z0xuRENBZ | #AUSvIND pic.twitter.com/H3wwPFkPO0
— cricket.com.au (@cricketcomau) October 7, 2025
భారత్‌తో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ఆసీస్ జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్ , ఆడమ్ జంపా