టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో గెలుచుకుంది. కాగా.. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. అటు వెస్టిండీస్.. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురికావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైట్ వాష్ చేసిన తొలి జట్టు భారత్ కావడం విశేషం. 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ వైట్‌వాష్ చేసింది. ఆ తరువాత ఈ ఘనత సాధించి రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.
🚨 HISTORY CREATED IN ST. KITTS. 🚨
– Australia won their first T20i series by 5-0 margin.
– West Indies lost their first T20i series by 0-5 margin. pic.twitter.com/Bh5HvekbPr
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2025
ఇక ఆస్ట్రేలియా, విండీస్ ఐదో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 19.4 ఓవర్లలో 170 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మయర్ (52; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (35), జేసన్ హోల్డర్ (20) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, మాక్స్ వెల్, ఆడమ్ జంపా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Rishabh Pant : ఐదో టెస్టు నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో ఖతర్నాక్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 17 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గ్లెన్ మాక్స్‌వెల్ డకౌట్ అయినా, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (14)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ జోస్ ఇంగ్లిష్ (10)లు విఫలం అయ్యారు. మిచెల్ ఓవెన్ (17 బంతుల్లో 37 పరుగులు), కామెరూన్ గ్రీన్ (18 బంతుల్లో 32 పరుగులు), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 30 పరుగులు) మెరుపులు మెరిపించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసిన్ మూడు వికెట్లు తీశాడు. జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.