Ashwin : చెన్నైలో అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ మాస్ట‌ర్ ప్లాన్‌..!

మ‌రో నాలుగు రోజుల్లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 ఆరంభం కానుంది. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా (Australia) తో ఆడ‌నుంది.

Australia recall Ashwin duplicate

Australia recall Ashwin duplicate : మ‌రో నాలుగు రోజుల్లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 ఆరంభం కానుంది. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా (Australia) తో ఆడ‌నుంది. అక్టోబ‌ర్ 8న చెన్నై వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. సాధార‌ణంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలోని పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలం అన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి చోట, హోం గ్రౌండ్‌లో భార‌త సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్‌ అశ్విన్ (Ravichandran Ashwin) ప్ర‌మాదకారిగా మార‌తాడ‌ని ఆస్ట్రేలియా జ‌ట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే అశ్విన్ బౌలింగ్‌ను స‌మ‌ర్థవంతంగా ఎదుర్కోవాలని ఆసీస్ బ్యాట‌ర్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ ప్లాన్ వేసింది. అచ్చం అశ్విన్‌లాగే బౌలింగ్ చేసే బ‌రోడా ఆఫ్ స్పిన్న‌ర్ మ‌హేశ్ పితియా సేవ‌లు ఉప‌యోగించుకోవాల‌ని భావించింది. అత‌డి బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తే మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొన‌డం చాలా సులువు అవుతుంద‌ని బావించింది. వెంట‌నే అత‌డిని సంప్ర‌దించింది. అయితే.. ఆసీస్ ఆఫ‌ర్‌ను అత‌డు సున్నితంగా తిర‌స్క‌రించాడు. వ‌చ్చే నెల‌లో ప్రారంభ‌మ‌య్యే దేశ‌వాలీ సీజ‌న్‌లో బ‌రోడా జ‌ట్టును త‌రుపున ఆడాల్సి ఉండ‌డంతో ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు పితియా తెలిపాడు. ఇది ఖచ్చితంగా అద్భుతమైన ఆఫర్. అయితే వచ్చే నెలలో ప్రారంభమయ్యే దేశీయ సీజన్ కోసం బరోడా సెటప్‌లో నేను కూడా భాగమే. కాబట్టి.. నేను దాని గురించి ఆలోచించాను. మా కోచ్‌తో మాట్లాడాను. ఈసారి నేను శిబిరంలో చేరడం సాధ్యం కాదని వారికి తెలియజేశాను. అని పితియా చెప్పాడు.

Asian Games : గోల్ఫ్‌లో చ‌రిత్ర సృష్టించిన అదితి అశోక్.. 41కి చేరిన భార‌త ప‌త‌కాల సంఖ్య‌

Mahesh Pithiya with Ashwin

ఆ వెంట‌నే ఫోన్ కాల్ వ‌చ్చింది..

అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో అశ్విన్‌ని బీసీసీఐ ప్రకటించిన వెంటనే త‌న‌కు కాల్ వచ్చిందన్నాడు. అంతర్జాతీయ జట్లతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. అయితే..నా ప్రాధాన్యత మాత్రం దేశవాళీ క్రికెట్‌కే. నేను బరోడా కోసం ఆడటం వల్ల ఇంత దూరం వచ్చాను. సుదీర్ఘ సీజన్‌కు ముందు, నేను నా ఆటపై దృష్టి పెట్టాలని, ఆస్ట్రేలియన్ జట్టులో చేరకూడదని అనుకున్నాను అని మహేశ్ పితియా తెలిపాడు.

Yuzvendra Chahal: ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కక పోవడంపై యుజేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు