Yuzvendra Chahal: ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కక పోవడంపై యుజేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు

వరల్డ్ కప్ ఆడే భారత్ జట్టులో స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు స్థానం దక్కలేదు. 2016లో అరంగ్రేటం చేసిన అతను భారతదేశం తరపున వన్డే క్రికెట్ లో మూడవ అత్యధిక వికెట్లను కలిగి ఉన్నాడు. అయితే, జట్టులో ఎంపిక కాకపోవటం పట్ల చాహల్ మాట్లాడుతూ..

Yuzvendra Chahal: ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కక పోవడంపై యుజేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Yuzvendra Chahal

ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. మొత్తం పది జట్లు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను వెల్లడించాయి. బీసీసీఐ రెండు రోజుల క్రితం ప్రపంచ కప్ లో ఆడే ఫైనల్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తొలుత స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ కు అవకాశం దక్కింది. అయితే, గాయం కారణంగా తుది జట్టులో అతను ఎంపిక కాలేదు. అక్షర్ స్థానంలో అశ్విన్ కు బీసీసీఐ అవకాశం కల్పించింది.

MS Dhoni : క్రికెట్ మైదానంలోనే కాదు.. టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు.. వీడియో వైరల్

వరల్డ్ కప్ ఆడే భారత్ జట్టులో స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు స్థానం దక్కలేదు. 2016లో అరంగ్రేటం చేసిన అతను భారతదేశం తరపున వన్డే క్రికెట్ లో మూడవ అత్యధిక వికెట్లను కలిగి ఉన్నాడు. అయితే, జట్టులో ఎంపిక కాకపోవటం పట్ల చాహల్ మాట్లాడుతూ.. 15 మంది ఆటగాళ్లు మాత్రమే పాల్గొనగలరని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మేనేజ్ మెంట్ నిర్ణయాన్ని అంగీకరించానని చెప్పాడు. జట్టులో ఎంపిక కాకపోవటం పట్ల నాకు బాధగానే ఉంది. కానీ, జీవితంలో ముందుకు సాగడమే నా నినాదం. నేను ఇప్పుడు దానికి అలవాటు పడ్డాను .. మూడు ప్రపంచ కప్ లకు ఇలానే జరిగిదంటూ చాహల్ వ్యాఖ్యానించారు. భారత్ జట్టులోని స్పిన్నర్లతో పోటీ గురించి నేను ఆ కోణంలో ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే నేను బాగా ఆడతానని నాకు తెలుసు అని చాహల్ అన్నారు.

ICC Mens World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే 10 జ‌ట్ల వివ‌రాలు ఇవే.. ఏయే జ‌ట్టులో ఎవ‌రెవరు ఉన్నారంటే..?

నేను జట్టులో భాగమైనా, కాకపోయినా వారు నా సోదరులు వంటివారు. సహజంగానే నేను భారతదేశానికి మద్దతు ఇస్తాను. నేను సవాలును ఇష్టపడుతున్నాను అని చామల్ చెప్పారు. చాహల్ భారత్ తరపున మూడు ప్రపంచ కప్ లు 2021, 2022లో టీ20 ప్రపంచ కప్‌లు, 2023లో వన్డే ప్రపంచ కప్ లో ఆడేందుకు దూరమయ్యాడు. 2022 ప్రపంచ కప్ జట్టులో భాగమైనప్పటికీ ఒక్క మ్యాచ్ లోకూడా ఆడే అవకాశం రాలేదు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిష‌న్‌, సూర్యకుమార్ యాదవ్.