MS Dhoni : క్రికెట్ మైదానంలోనే కాదు.. టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు.. వీడియో వైరల్

మహేందర్ సింగ్ ధోనీకి క్రికెట్‌తో‌పాటు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. తాజాగా టెన్నిస్ మ్యాచ్‌లో డబుల్స్ ఆడుతూ ధోనీ కనిపించాడు.

MS Dhoni : క్రికెట్ మైదానంలోనే కాదు.. టెన్నిస్ కోర్టులోనూ ధోనీ మెరుపులు.. వీడియో వైరల్

MS Dhoni

MS Dhoni Played Tennis: భారత్ మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. మహీ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టుకు విజయంపై ఆశలు సన్నగిల్లినట్లే. బ్యాటింగ్ ఆర్డర్‌లో మొదటిలో వచ్చినా, చివరిలో వచ్చినా మైదానంలో బౌండరీల వరద పారించడం ధోనీ స్పెషాలిటీ. అయితే, ధోనీ క్రికెట్ మైదానంలోనే ఇలా కనిపిస్తాడని అనుకుంటే పొరపాటే. ధోనీ టెన్నిస్‌లో‌కూడా మెరుపులు మెరిపించగలడు. ఇందుకు ఉదాహరణగా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also : Cricket World Cup : క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులు…ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు

మహేందర్ సింగ్ ధోనీకి క్రికెట్‌తో‌పాటు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమన్న విషయం తెలిసిందే. తాజాగా టెన్నిస్ మ్యాచ్‌లో డబుల్స్ ఆడుతూ ధోనీ కనిపించాడు. ధోనీ టెన్నిస్ కోర్టులో చురుకుగా కదులుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మిస్టర్ కూల్ ఎక్కడైనా సత్తా చాటగలడని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు ధోనీ ఫిట్‌నెస్‌ను ప్రశంసిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sumeet Kumar Bajaj (@bajaj.sumeetkumar)

 

మహేంద్ర సింగ్ ధోనీ 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. 42ఏళ్ల ధోనీ టీమిండియాకు మూడు ఫార్మాట్లలో నాయకత్వం వహించాడు. ధోనీ నాయకత్వంలో 2007లో టీ20 ప్రపంచ కప్‌లో, 2011లో వన్డే ప్రపంచ కప్ లో, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీని టీమిండియా గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌లో చెన్నై టీంకు సారథ్యం వహిస్తున్నాడు. తన సారథ్యంలో ఆ టీంకు ఇప్పటి వరకు ఐదు టైటిళ్లను అందించాడు.