Australia won by 8 wickets aginst westindies in 2nd T20
వెస్టిండీస్ క్రికెట్‌లో మరో శకం ముగిసింది. విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. సబీనా పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రస్సెల్ బ్యాట్‌తో అదరగొట్టినా బౌలింగ్‌లో నిరాశపరిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ను తన హోంగ్రౌండ్‌లోనే ముగించాడు.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (51; 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆండ్రీ రస్సెల్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. కెప్టెన్ షై హోప్ (9), షిమ్రాన్ హెట్‌మయర్ (14), రోస్టన్ ఛేజ్ (16), రొమ్‌మెన్ పావెల్ (12) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
THE FINAL RUSSELMANIA. ❤️ pic.twitter.com/FgZw8d2mBq
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
అనంతరం లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 15.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్లు గ్లెన్ మాక్స్‌వెల్ (12), మిచెల్ మార్ష్ (21)లు విఫలమైనప్పటి జోస్ ఇంగ్లిష్ (78 నాటౌట్; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (56 నాటౌట్; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
WCL 2025 : 41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
ఒకే ఓవర్‌లో 16 పరుగులు..
ఇక ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో ఒకే ఒక ఓవర్‌ను వేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ను వేశాడు. తొలి బంతికే జోష్ ఇంగ్లిస్ సిక్స్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత బాల్ కి ఫోర్ కొట్టాడు. మూడో బంతిని వైడ్ పడగా.. మరో బంతికి ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో తొలి మూడు బంతులకు 15 పరుగులు ఇచ్చిన రస్సెల్.. చివరి మూడు బంతులకు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 16 పరుగులు సమర్పించుకున్నాడు.