WCL 2025 : 41 ఏజ్‌లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడిచినా కూడా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.

WCL 2025 AB de Villiers stunning Fielding against india goes viral
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడిచినా కూడా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 సీజన్‌లో తన బ్యాటింగ్‌తోనే కాకుండా మెరుపు ఫీల్డింగ్‌తోనూ దుమ్ములేపాడు. 41 ఏళ్ల వయసులో డివిలియర్స్ బౌండరీ లైన్ వద్ద చేసిన విన్యాసానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఏబీ డివిలియర్స్ (63 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో యూసఫ్ పఠాన్, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీశారు. అభిమన్యు మిథున్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనతో భారత్ ఘోరంగా విఫలమైంది. స్టువర్ట్ బిన్ని (37 నాటౌట్ ; 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (2), శిఖర్ ధావన్ (1)లతో పాటు అంబటి రాయుడు (0), సురేశ్ రైనా (16), యూసఫ్ పఠాన్ (5), ఇర్ఫాన్ పఠాన్ (10) లు విఫలం అయ్యారు. దీంతో భారత్ 18.2 ఓవర్లలో 111 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మైదానంలోని ఫ్లడ్‌లైట్లలో సమస్య వచ్చింది. ఎంతసేపటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 88 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.
డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్..
41 ఏళ్ల వయసులోనూ ఏబీడివిలియర్స్ తన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను ఇమ్రాన్ తాహిర్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని యూసఫ్ పఠాన్ భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద పరిగెత్తుకుంటూ వచ్చిన డివియర్స్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే.. అతడు బౌండరీ లైన్ ఆవలకు వెలుతున్న విషయాన్ని గమనించి బంతిని మైదానంలో ఉన్న ఫీల్డర్ సారెల్ ఎర్వీ దిశగా విసిరివేశాడు. అప్రమత్తంగా ఉన్న సారెల్ డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. దీంతో యూసఫ్ ఔట్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు డివిలియర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
𝐏𝐞𝐭𝐢𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐠𝐞𝐭 𝐀𝐁 𝐝𝐞 𝐕𝐢𝐥𝐥𝐢𝐞𝐫𝐬 𝐨𝐮𝐭 𝐨𝐟 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 📑✍️
Even after four years away from the game, he’s making the impossible look easy 😮💨#WCL2025 #ABD pic.twitter.com/ixmXJ6YBSK
— FanCode (@FanCode) July 22, 2025