ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రికార్డు సృష్టించిన నవోమి

ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రికార్డు సృష్టించిన నవోమి

అంచనాలు తారుమారు చేసింది ఆస్ట్రేలియా ఓపెన్ 2019. దిగ్గజాలందరికీ చేదు వార్తను మిగిల్చి జపాన్ యువ కెరటానికి టైటిల్ విజేతగా ఆహ్వానించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో నవోమి ఒసాకా సంచలనం సృష్టించింది. 

రెండుసార్లు వింబుల్డన్ విజేత  పెట్రా క్విటోవాతో జరిగిన ఫైనల్స్‌ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ప్రపంచ నెం.1గా నిలిచిన తొలి జపాన్ టెన్నిస్ క్రీడాకారిణిగా నవోమి రికార్డు సృష్టించింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌లో కాస్తా తడబడిన పెట్రా… 6-7తో నిలవగా, ఆ తర్వాతి సెట్‌లో జోరు పెంచిన పెట్రా 5-7 తేడాతో నవోమి ముందు తలొంచింది. 

ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి రౌండ్‌లో నవోమి చెలరేగి 6-4 తేడాతో ఈ సెట్‌లో గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.  ఓవరాల్‌గా 116 పాయింట్లను ఒసాకా సాధించి విజేతగా నిలవగా, 112 పాయింట్లను క్విటోవా సాధించారు. ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా, తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ని చేర్చుకుంది.