Ayush Mhatre : చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్..

చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆయుష్ మాత్రే (Ayush Mhatre) మిగిలిన ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు.

Ayush Mhatre has been ruled out of the remainder of IPL 2026 (pic credit@CSK)

  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్‌లో గాయ‌ప‌డిన ఆయుష్ మాత్రే
  • కోలుకునేందుకు 6 నుంచి 12 వారాల స‌మ‌యం
  • మిగిలిన సీజ‌న్ నుంచి త‌ప్పుకున్న యువ ఆట‌గాడు

Ayush Mhatre : ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌యాణం ఏమంత గొప్ప‌గా లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచ్‌లు ఆడ‌గా రెండు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో నాలుగు మ్యాచ్‌ల్లో ఓట‌మిని చ‌విచూసింది. ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేటు -0.780గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో కొన‌సాగుతోంది. గురువారం ఆ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఆ జ‌ట్టు యువ ఆట‌గాడు ఆయుష్ మాత్రే మిగిలిన ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ తెలియ‌జేసింది. గాయం నుంచి కోలుకునేందుకు అత‌డికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని, అందుక‌నే ఈ సీజ‌న్‌లో అత‌డు ఇక ఆడ‌డ‌ని చెప్పుకొచ్చింది.

Viral Video : తిక్క కుదిరిందా.. రీల్స్ పిచ్చితో యువ‌తి ఓవ‌రాక్ష‌న్‌.. 70 వేల ఉంగ‌రం గోవిందా.. వీడియో వైర‌ల్‌

ఏప్రిల్ 18న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా ఆయుష్ మాత్రే తొడ‌కండ‌రాలు ప‌ట్టుకున్నాయి. మ్యాచ్ అనంత‌రం అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్కానింగ్ నిర్వ‌హించ‌గా.. తీవ్ర‌మైన గాయంగా తేలింది. అత‌డు కోలుకునేందుకు క‌నీసం 6 నుంచి 12 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో మాత్రే మిగిలిన సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. కాగా.. అత‌డి స్థానంలో సీఎస్‌కే ప్ర‌స్తుతానికి ఎవ‌రిని తీసుకోలేదు.

భీక‌ర ఫామ్‌లో ఉన్న యువ ఆట‌గాడు ఆయుష్ మాత్రే దూరం కావ‌డం చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

‘ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఎడమ కాలి తొడ కండరాలకు గాయం కావడంతో ఆయుష్ మాత్రే ఐపీఎల్ 2026లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అత‌డు గాయం నుండి కోలుకోవడానికి 6 నుండి 12 వారాల సమయం పడుతుంది. అత‌డు త్వరగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము.’ అని సీఎస్‌కే ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.