Babar Azam : చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. టీ20క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అరుదైన ఘ‌నత సాధించాడు.

Babar Azam : చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. టీ20క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

Babar Azam

Babar Azam 10000 runs in T20s : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అరుదైన ఘ‌నత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 10వేల ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో అత‌డు వెస్టిండీస్ ఆట‌గాడు క్రిస్‌గేల్‌, టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. టీ20ల్లో 10 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకునేందుకు గేల్‌కు 285 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. బాబ‌ర్ 271 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. ఇక విరాట్ కోహ్లి 299 ఇన్నింగ్స్‌ల్లో ప‌ది వేలు ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు.

బాబర్ ఆజాం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌(పీఎస్ఎల్‌)లో పెషావ‌ర్ జ‌ల్మీకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. క‌రాచీ కింగ్స్‌తో మ్యాచ్‌లో పేస‌ర్ మీర్ హంజా బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీయ‌డంతో టీ20ల్లో 10వేల ప‌రుగుల‌ను బాబ‌ర్ పూర్తి చేసుకున్నాడు.

Yashasvi Jaiswal : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో య‌శ‌స్వి జైస్వాల్ దూకుడు.. కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడ‌కున్నా..

టీ20ల్లో అత్యంత వేగంగా 10వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

1. బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 271 ఇన్నింగ్స్‌లు
2. క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 285
3. విరాట్ కోహ్లి(భార‌త్‌) – 299
4. డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – 303
5. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 327
6. జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లాండ్‌) – 350

టీ20ల్లో అత్య‌ధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆట‌గాళ్లు వీరే..

1 .షోయబ్ మాలిక్ – 494 ఇన్నింగ్స్‌లలో 13159 పరుగులు
2 .బాబర్ ఆజం – 271 ఇన్నింగ్స్‌ల్లో 10026*
3.మహ్మద్ హఫీజ్ – 348 ఇన్నింగ్స్‌లలో 7946 పరుగులు
4. మహ్మద్ రిజ్వాన్ – 228 ఇన్నింగ్స్‌లలో 7268 పరుగులు
5. అహ్మద్ షెహజాద్- 254 ఇన్నింగ్స్‌లలో 7010 పరుగులు

కోహ్లికి కొడుకు పుట్టాడ‌ని తెలిసి.. పాకిస్తాన్‌లో ఏం చేశారో తెలుసా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావ‌ర్ జెల్మీ 19.5 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగులకు ఆలౌటైంది. పెషావ‌ర్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ బాబ‌ర్ ఆజాం (72; 51 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. రొమ్‌మ‌న్ పావెల్ (39; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స‌ర్లు), ఆసీఫ్ అలీ (23; 16 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌) లు రాణించారు. క‌రాచీ బౌల‌ర్ల‌లో మీర్ హంజా, హసన్ అలీ లు చెరో మూడు వికెట్లు తీశారు. డేనియల్ సామ్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా షోయ‌బ్ మాలిక్‌, మ‌హ్మ‌ద్ న‌వాజ్ లు చెరో వికెట్ తీశారు.