Babar Azam : ఆశ‌గా అడిగితే.. మ‌హిళా అభిమాని హృద‌యాన్ని ముక్క‌లు చేసిన బాబ‌ర్ ఆజాం.. వీడియో

Babar Azam : ప్రాక్టీస్ అనంత‌రం పాక్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అభిమానుల‌తో కాసేపు ముచ్చ‌టించాడు.

Babar Azam : ఆశ‌గా అడిగితే.. మ‌హిళా అభిమాని హృద‌యాన్ని ముక్క‌లు చేసిన బాబ‌ర్ ఆజాం.. వీడియో

Babar Azam

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను పాకిస్తాన్ జ‌ట్టు ఓట‌మితో ఆరంభించింది. పెర్త్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో 360 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓట‌మిని చ‌వి చూసింది. కాగా.. మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని ప‌ట్టుద‌లగా ఉంది. ఈ క్ర‌మంలో ప్రాక్టీస్ సెష‌న్ల‌లో పాక్ ఆట‌గాళ్లు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు. శుక్ర‌వారం జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్ అనంత‌రం చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పాకిస్తాన్ జ‌ట్టు ప్రాక్టీస్ ను చూసేందుకు చాలా మంది అభిమానులు స్టేడియానికి వ‌చ్చారు. ప్రాక్టీస్ అనంత‌రం పాక్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అభిమానుల‌తో కాసేపు ముచ్చ‌టించాడు. ప‌లువురు అభిమానులు ఆటోగ్రాఫ్‌లు కోర‌గా వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అయితే.. అత‌డు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండ‌గా ఓ మ‌హిళా అభిమాని బాబ‌ర్ పెట్టుకున్న క్యాప్ ను ఇవ్వాల‌ని అడిగింది.

Sanju Samson : తక్కువ అవకాశాలు.. ఎక్కువ అంచనాలు.. ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, కోహ్లీల స‌ర‌స‌న సంజు శాంస‌న్‌..!

బాబ‌ర్ మాత్రం ఇందుకు నిరాక‌రించాడు. త‌న వ‌ద్ద ఒక్క‌టే క్యాప్ ఉంద‌ని ఇవ్వ‌డం కుద‌ర‌ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేశాడు. దీంతో స‌ద‌రు మ‌హిళా అభిమాని కాస్త నిరాశ‌కు గురైంది.

నిజం చెప్పు బాబ‌ర్‌..

ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మ‌రీ అంత పిసినారి త‌నం ప‌నికి రాద‌ని ఒక‌రు అన‌గా.. నిజం చెప్పు బాబ‌ర్ నీ ద‌గ్గ‌ర నిజంగానే ఒక‌టే క్యాప్ ఉందా..? అని ఇంకొక‌రు కామెంట్ చేశారు. మొత్తంగా క్యాప్ పుణ్య‌మా అని బాబ‌ర్ మ‌రోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. ఇదిలా ఉంటే.. 1995 త‌రువాత నుంచి ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టు సిరీస్‌ను గెల‌వ‌లేదు.

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తొమ్మిది మ్యాచులు ఆడిన పాకిస్తాన్ కేవ‌లం నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. మ‌రో ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీస్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. దీంతో పాకిస్తాన్ జ‌ట్టు పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో అన్ని ఫార్మాట‌ల‌లో కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బాబ‌ర్ ప్ర‌క‌టించాడు. అత‌డి స్థానంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను షాన్ మ‌సూద్ చేపట్టాడు.

IPL 2024 : ఐపీఎల్‌లో కొత్త నిబంధ‌న‌..? బ్యాట‌ర్ల‌కు క‌ష్ట‌కాలం మొద‌లు..! ఫ‌లితాలు తారు మారు..?