Sanju Samson : తక్కువ అవకాశాలు.. ఎక్కువ అంచనాలు.. ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, కోహ్లీల స‌ర‌స‌న సంజు శాంస‌న్‌..!

అద్భుతమైన టాలెంట్ అత‌డి సొంతం. ప్ర‌తి ఒక్క‌రు అత‌డి గురించే చెప్పే మాట‌. ఐపీఎల్‌లో తానెంటో ఎప్పుడో నిరూపించుకున్నాడు. అయితే.. భార‌త జ‌ట్టులోకి మాత్రం వ‌స్తూ పోతూ ఉన్నాడు.

Sanju Samson : తక్కువ అవకాశాలు.. ఎక్కువ అంచనాలు.. ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, కోహ్లీల స‌ర‌స‌న సంజు శాంస‌న్‌..!

Sanju Samson joins Elite list

Sanju Samson joins Elite list : అద్భుతమైన టాలెంట్ అత‌డి సొంతం. ప్ర‌తి ఒక్క‌రు అత‌డి గురించే చెప్పే మాట‌. ఐపీఎల్‌లో తానెంటో ఎప్పుడో నిరూపించుకున్నాడు. అయితే.. భార‌త జ‌ట్టులోకి మాత్రం వ‌స్తూ పోతూ ఉన్నాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు టీమ్ఇండియా యువ ఆట‌గాడు సంజు శాంస‌న్‌. త‌న తోటి ఆట‌గాళ్లు అయిన రిష‌బ్ పంత్‌, ఇషాన్ కిష‌న్, శుభ్‌మ‌న్ గిల్ వంటి ప్లేయ‌ర్లు టీమ్ఇండియాలో త‌మ స్థానాల‌ను సుస్థిరం చేసుకున్న‌ప్ప‌టికీ శాంస‌న్‌కు మాత్రం ఎందుక‌నో అదృష్టం కలిసిరాలేదు.

తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ విదేశీ గ‌డ్డ‌పై క్లిష్ట‌ప‌రిస్థితుల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచులో 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 108 ప‌రుగులు చేశాడు. ఇది శాంస‌న్ వ‌న్డే కెరీర్‌లో మొద‌టి సెంచ‌రీ కావ‌డం విశేషం. కాగా.. ఈక్ర‌మంలో శాంస‌న్ ఓ అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు.

IPL 2024 : ఐపీఎల్‌లో కొత్త నిబంధ‌న‌..? బ్యాట‌ర్ల‌కు క‌ష్ట‌కాలం మొద‌లు..! ఫ‌లితాలు తారు మారు..?

వ‌న్డేల్లో 500 పైగా ప‌రుగులు చేసిన టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌ల‌లో 50 కి పైగా స‌గ‌టుతో ప‌రుగులు చేసిన జాబితాలో సంజు శాంస‌న్ చోటు ద‌క్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ, మ‌హేంద్ర సింగ్ ధోని, శుభ్‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహుల్ లు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జాబితాలో ఉండ‌గా తాజాగా ఈ జాబితాలో సంజు చోటు ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సంజు 16 వ‌న్డేలు ఆడ‌గా ఇందులో 14 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. 56.7 స‌గ‌టుతో 510 ప‌రుగులు చేశాడు. ఓ సెంచ‌రీ, మూడు హాఫ్ సెంచ‌రీలు అత‌డి ఖాతాలో ఉన్నాయి.

మ‌రో రికార్డులోనూ..

మరో రికార్డులోనూ సంజు శాంస‌న్ భాగం అయ్యాడు. తాజాగా సంజు చేసిన సెంచ‌రీతో ఈ ఏడాది భార‌త్ త‌ర‌పున 19 శ‌త‌కాలు న‌మోదు అయ్యాయి. దీంతో ఓ ఏడాదిలో వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన జ‌ట్టుగా టీమ్ఇండియా మూడో సారి చరిత్ర సృష్టించింది. 2017లోనూ భార‌త ఆట‌గాళ్లు 19 సెంచ‌రీలు చేయ‌గా 1998లో 18 సెంచరీలు చేశారు.

Hardik Pandya : ఎయిర్ పోర్టులో హార్దిక్ పాండ్య‌కు చేదు అనుభ‌వం.. ‘ముంబైకా రాజా రోహిత్ శర్మ’