Babar Azam completes 1000 runs in ICC ODI tournaments
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ టోర్నీల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మూడో పాక్ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
టీమ్ఇండియా పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో కవర్ దిశగా బౌండరీ సాధించిన తరువాత ఆజామ్ ఈ రికార్డును చేరుకున్నాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో బాబర్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్లు సయూద్ అన్వర్, జావేద్ మియాందాద్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్ లో షమీ ఓ ‘చెత్త’ రికార్డు..
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 26 బంతులను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు బాది 23 పరుగులు సాధించాడు.
ఐసీసీ వన్డే ఇంటర్నేషన్ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ బ్యాటర్లు..
* సయూద్ అన్వర్ – 25 ఇన్నింగ్స్‌ల్లో 1204 పరుగులు
* జావెద్ మియాందాద్ – 30 ఇన్నింగ్స్‌ల్లో 1083 పరుగులు
* బాబర్ ఆజామ్ – 24 ఇన్నింగ్స్‌ల్లో 1005 పరుగులు
* మహ్మద్ యూసుఫ్ – 25 ఇన్నింగ్స్‌ల్లో 870 పరుగులు
* మిస్బా-ఉల్-హక్ – 19 ఇన్నింగ్స్‌ల్లో 865 పరుగులు.