IND vs PAK : ఇండియా పాక్ మ్యాచ్ లో షమీ ఓ ‘చెత్త’ రికార్డు..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో భారత సీనియర్ బౌలర్ షమీ తడబడ్డాడు.

Champions Trophy 11 Balls bowled by Mohammed Shami in 1st Over Against Pakistan
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకోవాలని భారత్ ఆరాటపడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి టోర్నీలో నిలవాలని పాక్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. ఇంతటి కీలక మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత తుది జట్లులో ఎలాంటి మార్పులు చేయలేదు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. అటు పాకిస్తాన్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఓపెనర్ ఫఖార్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ వచ్చాడు.
తొలి ఓవర్‌లో 11 బంతులు..
తొలి ఓవర్‌ను టీమ్ఇండియా సీనియర్ పేసర్ షమీ వేశాడు. ఈ ఓవర్‌లో షమీ 11 బంతులను వేశాడు. ఇందులో ఐదు వైడ్స్ ఉన్నాయి. తొలి బంతిని ఇమామ్ ఎదుర్కొన్నాడు. ఎలాంటి పరుగు రాలేదు. అయితే.. రెండో బంతిని షమీ వైడ్‌గా వేశాడు. ఆతరువాత బంతికి రన్ రాలేదు. ఆ తరువాత వరుసగా రెండు వైడ్స్ వేశాడు. ఆ తరువాత ఓవర్‌లోని ఆఖరి బంతికి వరుసగా రెండు వైడ్స్ వేశాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో ఆరు పరుగులు వచ్చాయి. ఇందులో ఐదు వైడ్స్ ఉన్నాయి. తొలి ఓవర్ సాగింది ఇలా.. 0, Wd, 0, Wd, Wd, 0, 1, 0, Wd, Wd, 0,
చెత్త రికార్డు..
టీమ్ఇండియా మాజీ పేసర్లు జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత వన్డేల్లో 11 బంతుల ఓవర్ వేసిన మూడో భారతీయుడిగా షమీ నిలిచాడు. జహీర్ ఆరు సందర్భాలలో 10 బంతుల ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చర్రితలో ఓ ఓవర్‌లో అత్యధిక బాల్స్ వేయడం ఇది మూడోసారి. బంగ్లాదేశ్ కు చెందిన హసిబుల్ హొస్సేన్, జింబాబ్వేకు చెందిన తినాషే పన్యాంగర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరు 13 బంతుల చొప్పున ఓ ఓవర్‌ను వేశారు. ఇప్పుడు షమీ 11 బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.
It’s good that Mohammed Shami made a path for Pakistan to score more runs
Pakistan should use of it#CT2025 #Virat #Kohli #Rohit #ChampionsTrophy #IndVsPak #INDvPAK #PAKvIND #PAKvsIND #BabarAzam #Shami #ViratKohli pic.twitter.com/cIJyyzMogQ
— Beb_ra (@bebra_beb) February 23, 2025