Mohammed Shami : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 9 కిలోల బరువు తగ్గిన షమీ.. ఒక్క పూట భోజనం.. ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..
తన ఫిట్‌నెస్ గురించి షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Mohammed Shami Loses nine kg Before Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా రాణించాలంటే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. దాదాపు 14 నెలల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తన సత్తా చూపాడు. ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఐసీసీ టోర్నీల్లో తానెంత ప్రమాదకారో మరోసారి రుజువు చేశాడు.
స్వదేశంలో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో సైతం షమీ అద్భుతంగా రాణించాడు. ఆ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్ అనంతరం చీల మండల గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చాలా కాలం పాటు ఫిట్‌నెస్ కోసం శ్రమించాడు. ఆ తరువాత దేశవాళీ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఫర్వాలేదనిపించినా, షమీ బౌలింగ్ లయను అందుకుంటాడా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే.. వాటి అన్నింటిని ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌తోనే పటాపంచలు చేశాడు. కాగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తరువాత షమీ టీమ్ఇండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సింధుతో తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను 9 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు.
Shami 🤝 ICC Tournaments
From his love for biryani to his comeback, catch @MdShami11‘s post-match interview with @sherryontopp! 🎙
Up Next ▶ The #GreatestRivalry 🇮🇳 🆚 🇵🇰#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | SUN, 23rd FEB, 1:30 PM on Star Sports 1, Star Sports 1 Hindi,… pic.twitter.com/yDPKdyQcEq
— Star Sports (@StarSportsIndia) February 21, 2025
మీరు బిర్యానీ తినడం లేదా? అని నవజ్యోత్ సింగ్ సింధు అడుగగా.. తాను ఎన్‌సీఏలో ఉన్నప్పుడు తన బరువు 90 కిలోలో అని షమీ చెప్పుకొచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్నప్పుడు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం సవాల్‌తో కూడుకున్నది తెలిపాడు. అయితే.. తనకు రుచికరమైన ఆహారం తినాలనే కోరిక అయితే ఏమీ లేదన్నాడు. అలాగే స్వీట్లు కూడా ఎక్కువగా తినను అని చెప్పాడు.
అయితే.. బిర్యానీ విషయంలో ఆందోళన ఉండేది. కానీ అప్పుడప్పుడు చేసే చీట్ మీల్స్ తో పెద్ద సమస్య ఉండేది కాదన్నాడు. ఇక 2015 నుంచి తాను రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నానని షమీ తెలిపాడు. ఉదయం, మధ్యాహ్నాం తినను అని, రాత్రి మాత్రమే తింటానని వెల్లడించాడు. అయితే.. ఇది అంత సులభమైన విషయం కాదన్నాడు. మొదట్లో కష్టమైనా ఒక్కసారి అలవాటు అయితే ఈజీ అయిపోతుందన్నాడు.
వన్డేల్లో 200 వికెట్లు..
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో షమీ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన భారత ఆటగాడిగా షమీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అజిత్ అగార్కర్ 133 ఇన్నింగ్స్‌ల్లో రెండు వందల వికెట్లు తీయగా, షమీ కేవలం 103 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు..
మహ్మద్ షమీ – 103 ఇన్నింగ్స్‌లు
అజిత్ అగార్కర్ -133 ఇన్నింగ్స్‌లు
జహీర్ ఖాన్ – 144 ఇన్నింగ్స్‌లు
అనిల్ కుంబ్లే – 147 ఇన్నింగ్స్‌లు
జవగల్ శ్రీనాథ్ – 147 ఇన్నింగ్స్‌లు
కపిల్ దేవ్ – 166 ఇన్నింగ్స్‌లు