IND vs PAK : టీమ్ఇండియాను ఏడిపించిన పాక్ బ్యాటర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో వెక్కి వెక్కి ఏడ్చాడు.. భారత్, పాక్ మ్యాచ్‌కు ముందు వీడియో వైరల్..
భారత్, పాక్ మ్యాచ్‌కు ముందు పాక్ ఓపెనర్ డ్రెస్సింగ్ రూమ్ వీడియో వైరల్‌గా మారింది.

Fakhar Zaman dressing room video viral ahead of IND vs PAK match in Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా ఆదివారం తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియోలో అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తూ కనిపించాడు.
ఛాంపియన్స్ 2025లో పాకిస్తాన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం పాలైంది. కివీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే క్రమంలో స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా రావాల్సిన అతడు నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఓ వైపు నొప్పి వేదిస్తున్నా 41 బంతుల్లో 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ అసాంతం అతడు ఇబ్బంది పడినట్లుగానే కనిపించింది.
ఔటైన తరువాత అతడు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో మెట్లు ఎక్కుతూ ఇబ్బంది పడ్డాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన తరువాత ఫఖర్ కుర్చీలో కూర్చొని ఏడ్చేశాడు. పక్కనే ఉన్న షాహీన్ అఫ్రిది, అసిస్టెంట్ కోచ్‌లు పఖర్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
కాగా.. మ్యాచ్ అనంతరం అతడికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గాయం తీవ్రమైనది అని తేలింది. దీంతో కొన్ని వారాలు అతడికి విశ్రాంతి అవసరం అని సూచించారు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఇమామ్ ఉల్ హక్ ను పాక్ తీసుకుంది.
నాటి ఫైనల్‌లో భారత్‌ను ఏడిపించి..
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలవడంతో ఫఖర్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. భారత్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫఖర్ శతకంతో చెలరేగాడు. 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 114 పరుగులు చేశాడు. పఖర్ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాక్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు విఫలం కావడంతో 30.3 ఓవర్లలో 158 పరుగులకే టీమ్ఇండియా కుప్పకూలింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (76) ఒక్కడే రాణించాడు. పాక్ 180 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది.
కాగా.. 8 ఏళ్ల తరువాత జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే.. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఆదివారం భారత్‌తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గనుక విజయం సాధిస్తే.. టోర్నీ నుంచి పాక్ ఇంటి ముఖం పట్టనుంది. ఇంతటి కీలక మైన మ్యాచ్‌కు గతంలో భారత్‌కు పీడకల మిగిల్చిన ఫఖర్ లేకపోవడంతో పాక్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.