IND vs PAK : మరో కాంట్రవర్సీ.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు.. ఇదేం బాలేదు..
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

PCB complains ICC of big miss during IND vs BAN match
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం (ఫిబ్రవరి 23న) జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందుకు ఓ వివాదం తలెత్తినట్లుగా కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ తప్పిదం గురించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యక్షప్రసారంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక లోగో ప్రసారం చేసినప్పటికి అందులో పాకిస్తాన్ పేరు లేదు. ఈ విషయాన్నే పీసీబీ ఓ లేఖ ద్వారా ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లుగా ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
‘ఫిబ్రవరి 20న జరిగిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా.. “ఛాంపియన్స్ ట్రోఫీ 2025” అనే ఈవెంట్ లోగో ప్రత్యక్ష ప్రసారం అంతటా ప్రదర్శించబడింది. అయితే..ఆతిథ్య దేశం అయిన పాకిస్తాన్ పేరు ఎక్కడా లేదు. దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లతో సహా అన్ని ప్రసారాలలో ఈవెంట్ పేరు, ఆతిథ్య దేశం పేరు రెండింటినీ ఉంచాలనే ఒప్పందాన్ని ప్రసారకులు పాటించలేదు.’ అని ఆ లేఖలో పీసీబీ పేర్కొంది.
ఆసక్తికరంగా.. కరాచీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో అలాగే ఫిబ్రవరి 21 శుక్రవారం అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ లోగోను సరిగ్గా ప్రదర్శించారు.
కాగా.. ఈ వివాదంపై ఐసీసీ స్పందించింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ప్రసార లోగో నుండి పాకిస్తాన్ పేరును తొలగించడం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని Geo టీవీ నివేదిక ఇచ్చినట్లు ఐసీసీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. టీమ్ఇండియా పాల్గొనే మిగిలిన అన్ని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార సమయంలో పాకిస్తాన్ పేరుతో సహా అధికారిక లోగో ప్రదర్శించబడుతుందని ప్రతినిధి హామీ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారంలో సాంకేతిక సమస్య ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా క్లిప్‌లలో ఉపయోగించిన లోగోపై పాకిస్తాన్ పేరు సరిగ్గా ప్రదర్శించబడిందని ఐసిసి అధికారి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 23న జరగనున్న భారత్, పాక్ మ్యాచ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ ఓటమితో మొదలు పెట్టగా, భారత్ విజయంతో ఆరంభించింది. దీంతో ఈ టోర్నీ సెమీస్ రేసులో నిలవాలంటే భారత్ పై పాకిస్తాన్ తప్పక విజయం సాధించాల్సి ఉంది. పాక్ ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్ చేరుకునే అవకాశాలు మెరుగు అవుతాయి. అదే సమయంలో ఈ టోర్నీ నుంచి పాక్ ఇంటి ముఖం పడుతుంది.