IML 2025 : మళ్లీ బరిలోకి సచిన్, యువరాజ్, గేల్, లారా.. నేటి నుంచే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్.. మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చంటే?
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతోంది.

International Masters League 2025 starts from today schedule and live streaming details here
సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్‌గేల్, బ్రియాన్ లారా, కుమార సంగక్కర వంటి సీనియర్ ఆటగాళ్లు మైదానంలో తమ అద్భుత విన్యాసాలతో ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించారు. వీరంతా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. అయినప్పటికి మరోసారి వీరంతా అభిమానులను అలరించేందుకు సిద్ధం అయ్యారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో వీరంతా ఆడనున్నారు.
నేటి నుంచి మార్చి 16 వరకు ఈ టోర్నీ జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్ లు కలిపి మొత్తం 18 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరు జట్లు ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్, ఇంగ్లాండ్ మాస్టర్స్ లు బరిలో ఉన్నాయి.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం లు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మ్యాచ్ అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది.
మ్యాచ్‌లను ఎక్కడ చూడొచ్చంటే..?
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మ్యాచ్ లను జియోస్టార్, కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్ ద్వారా చూడొచ్చు.
టోర్నీలో పాల్గొనే ఆరు జట్లు ఇవే..
ఇండియా మాస్టర్స్ జట్టు..
సచిన్ టెండూల్కర్(కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేష్ రైనా, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టూవర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి, వినయ్ కుమార్, షాబాజ్ నదీమ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, పవన్ నేగి, గుర్కీరత్ సింగ్ మాన్, అభిమన్యు మిథున్.
శ్రీలంక మాస్టర్స్..
కుమార సంగక్కర, రొమేష్ కలువితరణ, అషాన్ ప్రియంజన్, ఉపుల్ తరంగ, నువాన్ ప్రదీప్, లాహిరు తిరిమన్నే, చింతక జయసంఘే, సీకుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉదాన, ధమ్మిక ప్రసాద్, సురంగ లక్మల్, దిల్రువాన్ పెరెరా, అసెల గుణరత్నే, చతురంగ డిసిల్వా.
వెస్టిండీస్ మాస్టర్స్..
బ్రియాన్ లారా (కెప్టెన్), క్రిస్ గేల్, కిర్క్ ఎడ్వర్డ్స్, లెండిల్ సిమ్మన్స్, నర్సింగ్ డియోనరైన్, ఆష్లే నర్స్, డ్వేన్ స్మిత్, చాడ్విక్ వాల్టన్, దినేష్ రామ్దిన్, విలియమ్స్ పెర్కిన్స్, ఫేడెన్ ఎడ్వర్డ్స్, జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులీమాన్ బెన్, టినో బెస్ట్
ఆస్ట్రేలియా మాస్టర్స్..
కల్లమ్ ఫెర్గూసన్, నాథన్ రియర్డన్, షాన్ మార్ష్, బెన్ కటింగ్, డాన్ క్రిస్టియన్, షేన్ వాట్సన్, బెన్ డంక్, పీటర్ నెవిల్లే, బెన్ హిల్ఫెన్‌హాస్, బెన్ లాఫ్లిన్, బ్రైస్ మెక్‌గెయిన్, జేమ్స్ ప్యాటిన్సన్, జాసన్ క్రెజా, నాథన్ కౌల్టర్-నైల్, జేవియర్ డోహెర్టీ
ఇంగ్లాండ్ మాస్టర్స్..
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఇయాన్ బెల్, కెవిన్ పీటర్సన్, డారెన్ మాడ్డీ, డిమిట్రియోస్ మస్కరెన్హాస్, టిమ్ బ్రెస్నన్, ఫిల్ మస్టర్డ్, టిమ్ అంబ్రోస్, బాయ్డ్ రాంకిన్, క్రిస్ స్కోఫీల్డ్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీవ్ ఫిన్, స్టువర్ట్ మీకర్
దక్షిణాఫ్రికా మాస్టర్స్..
అల్విరో పీటర్సన్, ఫర్హాన్ బెహార్డియన్, హషీమ్ ఆమ్లా, హెన్రీ డేవిడ్స్, జాక్వెస్ రుడాల్ఫ్, జాంటీ రోడ్స్, జాక్వెస్ కల్లిస్, జెపి డుమిని, వెర్నాన్ ఫిలాండర్, డేన్ విలాస్, మోర్నే వాన్ వైక్, ఎడ్డీ లీ, గార్నెట్ క్రుగర్, మఖాయ ఎన్టిని, థాండి త్షబలాలా
షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 22 : ఇండియా మాస్టర్స్ వర్సెస్ శ్రీలంక మాస్టర్స్ – డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై
ఫిబ్రవరి 23: ఆస్ట్రేలియా మాస్టర్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా మాస్టర్స్ – డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై
ఫిబ్రవరి 24: వెస్టిండీస్ మాస్టర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ మాస్టర్స్ – డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై
ఫిబ్రవరి 25: ఇండియా మాస్టర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ మాస్టర్స్ – డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై
ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా మాస్టర్స్ వర్సెస్ శ్రీలంక మాస్టర్స్ – డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై
ఫిబ్రవరి 28: వెస్టిండీస్ మాస్టర్స్ వర్సెస్ ఆస్ట్రేలియా మాస్టర్స్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
మార్చి 1: ఇంగ్లాండ్ మాస్టర్స్ వర్సెస్ శ్రీలంక మాస్టర్స్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
మార్చి 2: ఇండియా మాస్టర్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా మాస్టర్స్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
మార్చి 4: ఆస్ట్రేలియా మాస్టర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ మాస్టర్స్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
మార్చి 5: వెస్టిండీస్ మాస్టర్స్ వర్సెస్ శ్రీలంక మాస్టర్స్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
మార్చి 6: ఇండియా మాస్టర్స్ వర్సెస్ ఆస్ట్రేలియా మాస్టర్స్ – నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
మార్చి 8: దక్షిణాఫ్రికా మాస్టర్స్ వర్సెస్ వెస్టిండీస్ మాస్టర్స్ – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్
మార్చి 9: ఇండియా మాస్టర్స్ వర్సెస్ వెస్టిండీస్ మాస్టర్స్ – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్
మార్చి 10: శ్రీలంక మాస్టర్స్ వర్సెస్ ఆస్ట్రేలియా మాస్టర్స్ – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్
మార్చి 11: ఇంగ్లాండ్ మాస్టర్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా మాస్టర్స్ – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్
నాకౌట్ దశ..
మార్చి 13: సెమీఫైనల్ 1 (1వ vs 4వ) – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్
మార్చి 14: సెమీఫైనల్ 2 (2వ vs 3వ) – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్
మార్చి 16: ఫైనల్ – షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్.