Babar Azam : బాబ‌ర్ ఆజాంకు కోప‌మొచ్చింది..! టీవీల ముందు మాట్లాడ‌డం ఈజీ..

Babar Azam fire : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ ప్ర‌యాణం దాదాపుగా ముగిసిన‌ట్లే. లీగ్ ద‌శ‌లో మ‌రో మ్యాచ్ మాత్ర‌మే ఆడాల్సి ఉంది.

Babar Azam

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో పాకిస్థాన్ ప్ర‌యాణం దాదాపుగా ముగిసిన‌ట్లే. లీగ్ ద‌శ‌లో మ‌రో మ్యాచ్ మాత్ర‌మే ఆడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ జ‌ట్టు మ‌హాద్భుతాన్ని చేయాల్సిందే. మొద‌ట బ్యాటింగ్ చేస్తే 287 ప‌రుగుల తేడాతో.. ల‌క్ష్య ఛేద‌న‌లో అయితే ఐదు నుంచి ఆరు ఓవ‌ర్ల‌లోపే ఛేదించాల్సి ఉంటుంది. క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటిది జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి పాకిస్థాన్ సెమీస్ చేర‌కుండానే ఈ మెగాటోర్నీ నుంచి ఇంటి ముఖం ప‌ట్టే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

ఈ క్ర‌మంలో పాకిస్థాన్ జ‌ట్టు పై ముఖ్యంగా కెప్టెన్ బాబ‌ర్ ఆజాం పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఆ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్లలో కొంద‌రు అయితే కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల పై బాబ‌ర్ స్పందించాడు. కెప్టెన్సీ బాధ్య‌త‌ల వ‌ల్ల తాను ఎలాంటి ఒత్తిడికి గురి కావ‌ట్లేద‌ని, త‌న బ్యాటింగ్ పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌డం లేద‌న్నాడు. ఈ మెగాటోర్నీలో త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే కొంత మంది ఇలా మాట్లాడుతున్నార‌ని అన్నాడు.

FACT CHECK : స‌చిన్ టెండూల్క‌ర్ కాళ్లు మొక్కిన మాక్స్‌వెల్‌..? ఆ విధ్వంస‌క‌ర డబుల్ సెంచ‌రీ త‌రువాత‌..

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు బాబ‌ర్ మీడియాతో మాట్లాడాడు. ‘గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా పాకిస్థాన్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. ఎప్పుడూ ఇలా భావించ‌లేదు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంకా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సింది. ఒత్తిడిలో ఉండ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని కొంద‌రు అంటున్నారు. నిజానికి రెండున్న‌ర మూడేళ్లుగా సార‌థ్య బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నా. అప్పుడు, ఇప్పుడు నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఒక్కొక్క‌రికి ఒక్కొ అభిప్రాయం ఉండ‌డం స‌హ‌జం. అలా చేస్తే బాగుంటుంది. ఇలా చేస్తే బాగుంద‌ని టీవీల ముందు కూర్చుని మాట్లాడ‌డం చాలా ఈజీ. ఇలా మాట్లాడే వాళ్ల అంద‌రి ద‌గ్గ‌ర నా ఫోన్ నంబ‌ర్ ఉంది. వాళ్లు ఏదైన స‌ల‌హాను ఇవ్వ‌ద‌లిస్తే నేరుగా ఫోన్ చేసి చెప్ప‌వ‌చ్చు.’ అని బాబ‌ర్ త‌న‌ను విమ‌ర్శించే వారిపై మండిప‌డ్డాడు.

సెమీస్ అవ‌కాశాల‌పై మాట్ఠాడుతూ.. క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చున‌ని అన్నాడు. టోర్నీని ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామ‌ని చెప్పాడు. ఫఖర్ జమాన్ 20 నుంచి 30 ఓవర్లు ఆడితే అనుకున్నది సాధించగలమని, మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ ల పాత్ర కూడా కీలక‌మ‌ని తెలిపాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ సృజనాత్మక ఆర్ట్.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

ట్రెండింగ్ వార్తలు