Virat Kohli : విరాట్ కోహ్లీ సృజనాత్మక ఆర్ట్.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

Virat Kohli creative art : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Virat Kohli : విరాట్ కోహ్లీ సృజనాత్మక ఆర్ట్.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

Virat Kohli creative art

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌డికి ఫ్యాన్స్ ఉన్నారు. కొంద‌రు అభిమానులు అత‌డిని క‌ల‌వాల‌ని, సెల్పీలు దిగాల‌ని భావిస్తే.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టి కోహ్లీ పై అభిమానాన్ని ప్ర‌త్యేక ప‌ద్ద‌తుల్లో చాటుకుంటుంటారు. అలా ఓ అభిమాని రూపొందించిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ముందు నుంచి చూస్తే అది 18వ నెంబ‌ర్ అంకెగా క‌న‌బడుతోంది. 18 నంబ‌ర్ అనేది విరాట్ కోహ్లీ జెర్సీ నంబ‌ర్ అని చెప్పాల్సిన ప‌ని లేదు. సైడ్‌కు వ‌చ్చి చూస్తే మాత్రం హెల్మెట్ పెట్టుకుని న‌వ్వుతున్న విరాట్ కోహ్లీ ముఖం క‌నిపిస్తోంది. కోహ్లీ అంటే ఓ భావోద్వేగం, ది గ్లోబ‌ల్ ఐకాన్ అంటూ స‌ద‌రు నెటీజ‌న్ ఆ ఫోటో వీడియో కింద రాసుకొచ్చాడు.

Pakistan : పాకిస్థాన్ టీమ్ పై సెహ్వాగ్ సెటైర్లు.. దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయ్యుంటాదిగా..!

ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌చిన్ రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడా..?

స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లీ చెల‌రేగిపోతున్నాడు. అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. జ‌ట్టు విజ‌యాల్లో త‌న వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మెగా టోర్నీలో 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 108.60 స‌గ‌టుతో 543 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచులో సెంచ‌రీ చేసి వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన స‌చిన్ రికార్డును స‌మం చేశాడు. వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ 49 సెంచ‌రీలు చేశాడు. మ‌రో సెంచ‌రీ చేస్తే స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు అవుతుంది.

Henry Nicholls : ఓ వైపు న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు స‌న్న‌ద్ధం అవుతుండ‌గా.. మ‌రోవైపు కివీస్ ఆట‌గాడిగాపై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు

భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో విజ‌యాలు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే.. లీగ్ ద‌శ‌లో ఓ మ్యాచ్‌, సెమీ పైన‌ల్‌, ఫైన‌ల్ ఇలా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచుల్లోనే స‌చిన్ రికార్డును విరాట్ బ‌ద్ద‌లు కొట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.