Henry Nicholls : ఓ వైపు న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు స‌న్న‌ద్ధం అవుతుండ‌గా.. మ‌రోవైపు కివీస్ ఆట‌గాడిగాపై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు

ఓ వైపు న్యూజిలాండ్ టీమ్ భార‌త్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతోండ‌గా మ‌రో వైపు ఆ జ‌ట్టు క్రికెట‌ర్ హెన్రీ నికోల్స్ పై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

Henry Nicholls : ఓ వైపు న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు స‌న్న‌ద్ధం అవుతుండ‌గా.. మ‌రోవైపు కివీస్ ఆట‌గాడిగాపై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు

Henry Nicholls

Henry Nicholls – Ball Tampering : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌లో న్యూజిలాండ్ దాదాపుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్ జ‌ట్లు త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచుల్లో ఏదైన అద్భుతం చేస్తే త‌ప్ప కివీస్ సెమీస్‌కు వెళ్ల‌కుండా అడ్డుకోలేవు. ఓ వైపు న్యూజిలాండ్ టీమ్ భార‌త్‌తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతోండ‌గా మ‌రో వైపు ఆ జ‌ట్టు క్రికెట‌ర్ హెన్రీ నికోల్స్ పై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన్న న్యూజిలాండ్ జ‌ట్టులో హెన్నీ నికోల్స్‌కు చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే.

కొన్ని రోజుల కింద‌ట దేశ‌వాలీ టోర్నీ అయిన ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో నికోల్స్ కివీస్ క్రికెట్ బోర్డు రూపొందించిన నిబంధ‌న‌ల‌ను ఉల్ల‌ఘించిన‌ట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో కథ‌నంలో పేర్కొంది. కాంటర్బరీ, ఆక్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో నికోల్స్ త‌ప్పు చేసిన‌ట్లు అంపైర్లు గుర్తించారు. ఈ మ్యాచ్‌లో కాంటర్బరీ ఆట‌గాడైన నికోల్స్ బంతిని హెల్మెట్ కేసి రుద్ది ఆకారాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు అంపైర్లు ఆరోపించారు. దీనిపై వారు కివీస్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.

World Cup 2023: పాకిస్థాన్ కు ఇంకా సెమీస్ ఛాన్స్ ఉందా..?

నికోల్స్‌ బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే మాత్రం అత‌డి పై కివీస్ బోర్డు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే ఆస‌క్తిక‌రంగా మారింది. కొన్ని మ్యాచులు ఆడ‌కుండా నిషేదం విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప‌లువురు క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా.. విచార‌ణ‌కు నికోల్స్ ఎప్పుడు హాజ‌రు అవుతాడు..? అంపైర్లు చేసిన ఆరోప‌ణ‌ల‌పై అత‌డు ఏ విధంగా స్పందిస్తాడు..? అన్న సంగ‌తి తెలియాల్సి ఉంది.

బంగ్లా ప‌ర్య‌ట‌కు ఎంపికైయ్యాడు..

నికోల్స్ న్యూజిలాండ్ త‌రుపున 54 టెస్టులు, 72 వ‌న్డేలు, 10 టీ 20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 2,948 ప‌రుగులు చేశాడు. ఇందులో 9 శ‌త‌కాలు, 12 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 1,960 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 14 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. టీ20ల్లో 100 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

Rachin Ravindra: రచిన్ రవీంద్ర వీడియా వైరల్.. ఇంతకీ ఏముంది అందులో?

Henry Nicholls

Henry Nicholls

ఇదిలా ఉంటే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత న్యూజిలాండ్ జ‌ట్టు బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌కు వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే ఈ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న కివీస్ బృందాన్ని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. రెండు టెస్టు మ్యాచులు ఆడే కివీస్ జ‌ట్టులో నికోల్స్‌కు చోటు ద‌క్కింది. టిమ్ సౌథీ సార‌థ్యంలోని కివీస్ బృందం న‌వంబ‌ర్ 21న బంగ్లాదేశ్‌కు వెళ్ల‌నుంది.