Babar Azam : అయ్యో కోపమొచ్చింది..! ప్రేక్షకులపై బాటిల్ విసిరేయబోయిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్.. వీడియో వైరల్

బాబర్ అజామ్ ను అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చారు. గత రెండు సంవత్సరాలుగా బాబర్ బ్యాటర్ గా విఫలమవుతున్నాడు.

PSL 2024 Babar Azam : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ కంట్రోల్ తప్పబోయాడు. మైదానంలో తనను ట్రోల్ చేస్తున్న ప్రేక్షకులపై వాటర్ బాటిల్ విసిరేసేందుకు ప్రయత్నించాడు.. ఇంతలో తనకోపాన్ని అనుచుకొని సైలెంట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ బాబర్ అలా ఎందుకు చేశాడు..? ప్రేక్షకులు ఏమని కామెంట్స్ చేశారంటే..

Also Read : Kieron Pollard : బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్ పట్టిన వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. వీడియో వైరల్

బాబర్ అజామ్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2024 సీజన్ లో పెషావర్ జల్మీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బాబర్ ఇటీవల ఫామ్ ను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2023లో జరిగిన ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ సమయంలో అతని కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోర పరాభవాలను ఎదుర్కొంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ బాధ్యతల నుంచి నుంచి తప్పించింది. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో బాబర్ అజామ్ ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అతను మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో తన విమర్శకులకు మెరుగైన బ్యాటింగ్ తో దీటైన సమాధానం ఇవ్వాలని ఆజామ్ భావిస్తున్నాడు.

Also Read : Tarun : క్రికెట్ ఆడటానికి వెళ్లి కంగారూలతో ఆడుకుంటున్న తరుణ్

అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ వారుసడిగా బాబర్ అజామ్ ప్రశంసలు అందుకున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో అతని కెప్టెన్సీలో పాకిస్థాన్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో క్రీడాభిమానులు అజామ్ పై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీకి నాయకత్వం వహిస్తున్న అజామ్.. శనివారం మ్యాచ్ సమయంలో ట్రోలింగ్ కు గురయ్యాడు. సాంకేతిక సిబ్బందితో బౌండరీ లైన్ అవతల కూర్చున్న బాబర్ అజామ్ ను ‘జిమ్‌బాబర్’ అంటూ పెద్దపెట్టున ప్రేక్షకులు నినాదాలు చేశారు. దీంతో బాబర్ కు కోపం వచ్చి అలా అనొద్దు అంటూ ప్రేక్షకులకు సైగ చేశాడు. అయినా ‘జిమ్‌బాబర్’ అంటూ మైదానంలోని ప్రేక్షకులు అరవడం కొనసాగించారు. దీంతో బాబర్ తనవద్ద వాటర్ బాటిల్ ను చూపిస్తూ కోపంతో ప్రేక్షకులపై విసిరేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read : Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో రికార్డు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 600+ప‌రుగులు.. దిగ్గ‌జాల స‌ర‌స‌న‌..

‘జిమ్‌బాబర్’ అంటే ఎమిటి?
బాబర్ అజామ్ ను అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చారు. గత రెండు సంవత్సరాలుగా బాబర్ బ్యాటర్ గా విఫలమవుతున్నాడు. బలహీనమైన జట్టుపై పెద్దస్కోర్లు చేసిన బాబర్.. బలమైన జట్లపై పేలవ ప్రదర్శన ఇస్తున్నాడు. బాబర్ రన్స్ చేసిన చిన్నజట్లలో జింబాబ్వే కూడా ఉంది. దీంతో ‘జిమ్‌బాబర్’ అనే పదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన బాబర్.. జింబాబ్వేపై మాత్రమే స్కోర్ చేయగలడని, అతని పేలవమైన ఫామ్ ను ముగించడానికి జింబాబ్వేతో సిరీస్ అవసరమని సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నాడు. ఈ క్రమంలో మైదానంలోనూ ప్రేక్షకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘జిమ్‌బాబర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కోపంతో అజామ్ కంట్రోల్ తప్పే స్థాయికి వెళ్లిపోయాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు