Babar Hayat : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే రికార్డులు బ్రేక్.. రోహిత్ శర్మ రెండు రికార్డుల‌ను అధిగమించిన హాంగ్‌కాంగ్‌ బ్యాట‌ర్‌..

ఆసియాక‌ప్ 2025లో తొలి మ్యాచ్‌లోనే హాంగ్ కాంగ్ ఆట‌గాడు బాబ‌ర్ హ‌య‌త్ (Babar Hayat) ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను సాధించాడు.

Babar Hayat becomes Most sixes For Mens T20 Asia Cup

Babar Hayat : ఆసియా కప్ 2025 టోర్నీని అఫ్గానిస్తాన్ ఘ‌న విజ‌యంతో మొద‌లుపెట్టింది. 94 ప‌రుగుల తేడాతో హాంగ్‌కాంగ్‌ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో సెదిఖుల్లా అటల్‌ (73 నాటౌట్‌; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (53; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించారు.

అనంత‌రం 189 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హాంగ్‌కాంగ్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. హాంగ్‌కాంగ్‌ బ్యాట‌ర్ల‌లో బాబ‌ర్ హ‌య‌త్ (39; 43 బంతుల్లో 3 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో గుల్బదిన్‌, ఫారూఖీ లు చెరో రెండు వికెట్లు తీశారు.

Abhishek Sharma : సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డిన అభిషేక్ శ‌ర్మ‌.. గంట వ్య‌వ‌ధిలో 25 నుంచి 30 సిక్స‌ర్లు.. ప్ర‌త్య‌ర్థుల‌కు ద‌బిడిదిబిడే..

రోహిత్ రికార్డులు బ్రేక్‌..

ఈ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ హ‌య‌త్ (Babar Hayat) ప‌లు ఘ‌న‌త‌ల‌ను సాధించాడు. ఆసియా క‌ప్ టీ20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జాబితాలో అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. అంతేకాదండోయ్ ఆసియాక‌ప్ టీ20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో హ‌య‌త్ 43 బంతుల్లో మూడు సిక్స‌ర్లు బాది 39 ప‌రుగులు చేశాడు. దీంతో టీ20 ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌ను అధిగ‌మించాడు. రోహిత్ శ‌ర్మ 9 మ్యాచ్‌ల్లో 271 ప‌రుగులు చేయ‌గా.. బాబ‌ర్ హ‌య‌త్ 6 మ్యాచ్‌ల్లో 274 ప‌రుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 429 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

టీ20 ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 10 మ్యాచ్‌ల్లో 429 ప‌రుగులు
* మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (పాకిస్తాన్‌) – 6 మ్యాచ్‌ల్లో 281 ప‌రుగులు
* బాబ‌ర్ హ‌య‌త్ (హాంగ్‌కాంగ్‌) – 6 మ్యాచ్‌ల్లో 274 ప‌రుగులు
* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 9 మ్యాచ్‌ల్లో 271 ప‌రుగులు
* ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (అఫ్గానిస్తాన్‌) – 6 మ్యాచ్‌ల్లో 197 ప‌రుగులు

Shubman Gill Clean Bowled : యూఏఈతో మ్యాచ్‌కు ముందు.. స్థానిక బౌల‌ర్ చేతిలో గిల్ క్లీన్ బౌల్డ్‌..

మూడు సిక్స‌ర్లు కొట్ట‌డం ద్వారా బాబ‌ర్ హ‌య‌త్ టీ20 ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్ట‌న ఆట‌గాళ్ల జాబితాలో అఫ్గాన్ ఆట‌గాళ్లు రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్‌ల‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్నాడు. వీరంతా తలా 13 సిక్స‌ర్లు బాదారు.

టీ20 ఆసియాక‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* బాబ‌ర్ హ‌య‌త్ (హాంగ్‌కాంగ్‌) – 6 మ్యాచ్‌ల్లో 13 సిక్స‌ర్లు
* రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్తాన్‌) – 6 మ్యాచ్‌ల్లో 13 సిక్స‌ర్లు
* నజీబుల్లా జద్రాన్ (అఫ్గానిస్తాన్‌) – 8 మ్యాచ్‌ల్లో 13 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 9 మ్యాచ్‌ల్లో 12 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 10 మ్యాచ్‌ల్లో 11 సిక్స‌ర్లు