Manpreet Singh: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్

టీమిండియా హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్‌ సింగ్‌ కొత్త ఉత్సాహంలో మునిగి తేలుతున్నాడు. తొలిసారి తండ్రి కాబోతున్నాడనే ఆనందంలో మునిగిపోయాడు.

Manpreet Singh: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్

Team India

Updated On : October 2, 2021 / 3:28 PM IST

Manpreet Singh: టీమిండియా హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్‌ సింగ్‌ కొత్త ఉత్సాహంలో మునిగి తేలుతున్నాడు. తొలిసారి తండ్రి కాబోతున్నాడనే ఆనందంలో మునిగిపోయాడు. ఈ గుడ్ న్యూస్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు మన్‌ప్రీత్‌. గర్భవతి అయిన భార్యతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. ఇద్దరు ఒకేలాంటి తెలుపు రంగు టీషర్టుల్లో ట్విన్నింగ్‌ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తున్నారు.

ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతేడాది డిసెంబరులో మలేషియా దేశానికి చెందిన ఫ్రెండ్ ఇలి నజ్వా సిద్ధిఖీని మ్యారేజ్ చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో జలంధర్‌లో పెళ్లి చేసుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న సమయంలో స్పెషల్ పర్మిషన్‌ తీసుకున్నారు నజ్వా.

………………………………………. : నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా.. ఇప్పుడు థియేటర్లలోకి..

టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందింది. గతంలో లేనంత ప్రతిభను చాటిన జట్టు యావత్ క్రీడా ప్రపంచ మన్ననలు అందుకుంది. సమాచారం ఇవ్వకుండా నజ్వా పంజాబీ కల్చర్‌లో వివాహం చేసుకోవడం తప్పుగానే పరిగణిస్తామని మలేసియా ఉప ప్రధాని మర్జుక్‌ అప్పట్లో పేర్కొన్నారు.