Badminton Asia Team Championships : ప‌త‌కాన్ని ఖాయం చేసుకున్న భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు

మ‌లేషియాలో జ‌రుగుతున్న బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు ప‌తకాన్ని ఖాయం చేసుకున్నారు.

Badminton Asia Team Championships : ప‌త‌కాన్ని ఖాయం చేసుకున్న భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు

Badminton Asia Team Championships Indian women assured of medal after QF win over Hong Kong

Updated On : February 16, 2024 / 1:47 PM IST

Badminton Asia Team Championships 2024 : మ‌లేషియాలో జ‌రుగుతున్న బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు ప‌తకాన్ని ఖాయం చేసుకున్నారు. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో హాంకాంగ్ పై 3-0 తేడాతో గెలుపొందారు. డ‌బుల్ ఒలింపిక్ ప‌త‌క విజేత పీవీ సింధు, అష్మిత చ‌లిహ‌, డ‌బుల్స్ జోడీ అశ్విని పొనప్ప‌, త‌నీషా క్రాస్టోలు లు హాంకాంగ్ ప్లేయ‌ర్లును చిత్తు చేశారు.

గాయం కార‌ణంగా చాలా కాలం ఆట‌కు దూరంగా ఉన్న సింధు త‌నలో ఏ మాత్రం స‌త్తా త‌గ్గ‌లేద‌ని నిరూపించింది. త‌న కంటే త‌క్కువ ర్యాంక్‌లో ఉన్న సిన్ యాన్ పై 21-7, 16-21,21-12 తేడాతో గెలుపొందింది. మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో పొన్న‌ప్ప‌, త‌నీషా జోడీ 18 ర్యాంక్‌లో ఉన్న యంగ్ న‌గా టింగ్, యంగ్ పూ లామ్‌ల జంట‌పై విజ‌యం సాధించింది.

Sarfaraz Khan : సూర్య వ‌ల్లే ఇదంతా.. అలా మెసేజ్ చేసి ఉండ‌క‌పోతే.. స‌ర్ఫ‌రాజ్ తండ్రి

35 నిమిషాల పాటు జ‌రిగిన ఈ పోటీలో 21-10, 21-14 తేడాతో భార‌త డ‌బుల్స్ జంట గెలుపొందింది. అనంత‌రం అశ్మిత 21-12, 21-13 తేడాతో యంగ్ సుమ్ యీ పై సునాయాస‌నంగా విజ‌యం సాధించింది.

ఈ విజ‌యంతో భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. క‌నీసం కాంస్య ప‌తాకాన్ని ఖాయం చేసుకుంది.

మహిళల జట్టుకు ఇది అనుకూలమైన ఫలితం. వారి ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని జట్టుతో ఉన్న మాజీ జాతీయ కోచ్ విమల్ కుమార్ షా ఆలం పిటిఐతో మాట్లాడుతూ అన్నారు.