Bangladesh vs India: బంగ్లాదేశ్‌ ముందు 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా

బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లా ముందు భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 3 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు.

Bangladesh vs India: బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లా ముందు భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 3 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు.

ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్ల సాయంతో 210 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 90 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 3,  కేఎల్ రాహుల్ 8, వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20, శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ 3 (నాటౌట్) , మొహమ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.

దీంతో టీమిండియా స్కోరు 50 ఓవర్లకు 409/8గా నమోదైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ హసన్, ఎదాబత్, టస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా, మెహిదీ హసన్, ముస్తాఫుజుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. వన్డే సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ తో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

Ishan Kishan: అతితక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్

ట్రెండింగ్ వార్తలు