Ishan Kishan: అతితక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్

126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు.

Ishan Kishan: అతితక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్

Ishan kishan

Ishan Kishan: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మూడో వన్డే శనివారం ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వీరవిహారం చేశాడు. తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా డబుల్ సెంచరీ చేశాడు.

India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీంఇండియా

126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు. వ్యక్తిగత స్కోర్ 210 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ వెస్టండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. 2015 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో గేల్ 138 బంతుల్లో జింబాబ్వేపై డ‌బుల్ సెంచ‌రీ చేయ‌గా.. ఇవాళ బంగ్లాపై కిష‌న్ కేవ‌లం 126 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ అందుకున్నాడు. గేల్ క‌న్నా 12 త‌క్కువ బాల్స్‌లోనే కిష‌న్ ఆ రికార్డును దాటేశాడు.

మరోవైపు ఇషాన్ కెరియర్ లో ఇదే డబుల్ సెంచరీ. అంతేకాక.. డబుల్ సెంచరీ చేసిన యువ క్రికెటర్ గా ఇషాత్ నిలిచాడు. ఇక వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ చేసిన ఏడవ బ్యాటర్ గా ఇషాన్ నిలిచాడు. ఇండియా తరపున సచిన్ టెండుల్కర్, వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మలు డబుల్ సెంచరీ చేయగా, విదేశీ ఆటగాళ్లలో మార్టిన్ గుప్తిల్, గేల్, ఫకర్ జమాన్ లు ఉన్నారు.