టెస్టుల్లో బంగ్లాదేశ్ అన్ని దేశాలపై గెలిచింది.. రెండు దేశాలపై తప్పా.. అవేంటో తెలుసా?

టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో పాటు పలు దేశాలపై బంగ్లాదేశ్ విజయాలు సాధించింది. కానీ ఆ రెండు దేశాలపై ఇంకా గెలవలేదు.

Bangladesh Test Cricket: సొంతగడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టును ఓడించి బంగ్లాదేశ్ హిస్టరీ క్రియేట్ చేసింది. టెస్టుల్లో ఫస్ట్ టైం పాకిస్థాన్ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు పాకిస్థాన్ జట్టును తమ సొంత దేశంలో 10 వికెట్ల తేడాతో ఓడించిన టీమ్‌గా బంగ్లాదేశ్ రికార్డుకెక్కింది. పాకిస్థాన్ జట్టులతో ఇప్పటివరకు బంగ్లాదేశ్ 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా 12 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇందులో 6 ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ డ్రా అయింది.

బంగ్లాదేశ్‌కు ఇది అతిపెద్ద గెలుపు
తాజాగా రావల్పిండిలో పాకిస్థాన్‌పై దక్కిన విజయం టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇది అతిపెద్ద గెలుపు. 2022లో మౌంట్ మౌంగనుయ్‌లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఓవరాల్‌గా ఛేజింగ్‌లో ఆరో విజయం. టెస్టుల్లో బంగ్లాదేశ్‌ ఛేదించిన అతిస్వల్ప లక్ష్యం (30 పరుగులు) కూడా ఇదే. మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన 565 పరుగులు.. టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు మూడో అతిపెద్ద స్కోరు. ఇక విన్నింగ్ టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు హయ్యస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం.

బంగ్లాదేశ్ 1, పాకిస్థాన్‌ 4
ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశాక బంగ్లాదేశ్‌ టెస్టులో విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశాక ఓడిపోవడం పాకిస్థాన్‌కు ఇది నాలుగోసారి కావడం గమనార్హం. పాకిస్థాన్‌ చివరిసారిగా 2016లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌తో జ‌రిగిన‌ టెస్టులో ఓటవి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో 443/9 స్కోరు వద్ద పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

Also Read: మీమ్స్‌తో పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌ను ఆడేసుకుంటున్న నెటిజనులు

రెండు దేశాలపై తప్పా..
బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లపై విజయాలు నమోదు చేసింది. అత్యధికంగా జింబాబ్వేను 8 సార్లు ఓడించింది. వెస్టిండీస్‌పై 4 పర్యాయాలు, న్యూజిలాండ్‌పై రెండుసార్లు గెలిచింది. మిగతా టీములపై ఒక్కోసారి విజయం సాధించింది. సౌతాఫ్రికా, ఇండియాపై మాత్రం బంగ్లాదేశ్ ఇంకా విజయాలు సాధించలేదు. బంగ్లాదేశ్ ఇదే జోరు కొనసాగిస్తే ఈ టీముల మీద కూడా గెలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: వీళ్లు మార‌రు.. బంగ్లా పై పాక్ ఓట‌మి.. టీమ్ఇండియానే కార‌ణ‌మ‌న్న‌ పాక్ మాజీ ఆట‌గాడు.. ఎలాగంటే..?

ట్రెండింగ్ వార్తలు