బంగ్లాదేశ్ చేతిలో చిత్తు.. మీమ్స్‌తో పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఆడేసుకుంటున్న నెటిజనులు
బంగ్లాదేశ్‌తో తాజాగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు దారుణంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.

Bangladesh 1st Test Win Over Pakistan Sparks Meme Fest in Social Media
Memes on Pakistan Cricket Team: సొంత దేశంలో చిన్న జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టును నెటిజనులు ఆడేసుకుంటున్నారు. రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో తాజాగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో పాక్ టీమ్ దారుణంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. ఫన్నీ వీడియోలు, ఫొటోలు, కామెంట్లతో దెప్పి పొడుస్తున్నారు. బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడిందని క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. పాకిస్థాన్ బాధ్యతారహితంగా ఆడి చేజేతులా ఓడిందని విమర్శిస్తున్నారు.
చెత్త నిర్ణయాలే పాకిస్థాన్ కొంప ముంచాయని, ఓవర్ కాన్పిడెన్స్‌తో ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందని పలువురు నెటిజనులు విమర్శించారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్ బౌలర్లు పసలేని బౌలింగ్‌తో కామెడీ షో చూపిస్తున్నారని, గతంలో ఇలా ఎప్పుడూ లేదని చురకలు అంటిస్తున్నారు.
? #PAKvBAN pic.twitter.com/On9Zvi5UDz
— Wasim Jaffer (@WasimJaffer14) August 25, 2024
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఓ ప్రత్యేకత ఉంది. ఆ టీమ్‌తో ఆడుతున్నప్పుడు గెలవడానికి అదనంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా మ్యాచ్‌లో ఓడిపోయే మార్గాన్ని వాళ్లే కనిపెడతారని ఓ నెటిజన్ సెటైర్ వేశారు.
One of the special things about Pakistan cricket is that when you play against them, you don’t need to do anything extra, they find a way to lose the match by themselves.
#PAKvBAN pic.twitter.com/bUNEtplrNu— Aussies Army?? (@AussiesArmy) August 25, 2024
ఈ మ్యాచ్‌లో విఫలమైన మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపైనా నెటిజనులు విరుచుకుపడ్డారు. విరాట్ కోహ్లిగా మారడానికి బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నాడు. బ్యాట్‌తో విఫలమవుతున్నాడు కాబట్టి కోహ్లి దూకుడును కాపీ చేయడానికి ట్రై చేస్తున్నాడని కామెంట్ పెట్టారు.
#PAKvBAN Babar Azam was Trying to become Virat kohli, He can’t do that with bat,So he tried to copy his Agression..
Us agression ka Reaction Babar Bhai ke sath poora pakistani yad Rakhega..?
Ku Padosiyo?#PakistanCricket pic.twitter.com/iiqBOxxIg5
— Aparna Mishra (Mishu) (@jaalim_chori) August 24, 2024
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజనులు అంటున్నారు. సొంతగడ్డపై ఓడించి పాకిస్తాన్‌కు రియాలిటీ చెక్‌ను బంగ్లాదేశ్ అందజేసింది. పాకిస్థాన్ ఆటతీరు ఎంత ఘోరంగా ఉందో ఈ మ్యాచ్‌తో అర్థమైంది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఇకనైనా కళ్లుతెరవాలని నెటిజన్ ఒకరు కామెంట్ చేశారు.
Bangladesh just handed Pakistan a reality check on their own turf. The first Test win in Pakistan’s backyard highlights the crumbling state of their cricket. Time for Pakistan to wake up from their nostalgia this isn’t the 90s anymore. #Pakistan #PakistanCricket#PAKvsBAN
— RAVI RAJPUROHIT (@Imrvrajpurohit) August 25, 2024
#PAKvBAN Pak pace bowlers are now a pure comedy show—never seen stats like these before! #Cricket #PaceBowlers pic.twitter.com/OJAZm8Zasl
— RingAndPitchInsight (@RingAndPitchIns) August 24, 2024
Me requested @ICC to ban Pakistan Cricket for my mental health.#PAKvBAN #Pct #ICC pic.twitter.com/lafKxVQVK2
— Hanzalah.10 (@hanzalahsays) August 25, 2024