BCB decided to approach ICC for a change of venue for their matches in T20 World Cup 2026
BCB : బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
భారత్, శ్రీలంక దేశాలు టీ20 ప్రపంచకప్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. లీగ్ దశలో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లు అన్ని కూడా భారత్ వేదికగానే జరగనున్నాయి.
KKR : బీసీసీఐ ఆదేశాలపై స్పందించిన కేకేఆర్.. మేము అతడిని వదిలివేస్తున్నాం..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, 17న వాంఖడేలో నేపాల్‌తో బంగ్లాదేశ్ ఆడనుంది. అయితే.. ఇప్పుడు తమ జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని బీసీబీ భావిస్తోందట. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నందున ప్లేయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ జట్టు మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంక కు మార్చాలని కోరనుందట.
‘ముస్తాఫిజుర్‌ను విడుదల చేయడం గురించి నేను ఎలాంటి కామెంట్స్ చేయను. ఎందుకంటే ఇది వారి అంతర్గత విషయం. అయితే.. ప్రపంచ కప్‌లో పాల్గొనడం విషయానికొస్తే.. ఇది ఐసీసీ ఈవెంట్. టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించిన విషయాన్ని ఐసీసీతో వీలైనంత త్వరగా బీసీబీ చర్చిస్తుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లి ఆడటానికి భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది.’ అని ఓ బీసీబీ అధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. మరి ఐసీసీ దీనిపై ఎలా స్పందిస్తుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Washington Sundar : నువ్వేమైనా కోహ్లీ, రోహిత్ అనుకుంటివా..? సుందర్ నీకు అంత తలపొగరు ఎందుకు?
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. మార్చి 8 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.