BCCI: మాజీ ప్లేయర్లు, అంపైర్ల జీతాన్ని పెంచిన బీసీసీఐ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అంపైర్లు, ఆటగాళ్ల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ అనంతరం రెట్టింపు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గేమ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం పెన్షన్ పెంచాలని నిర్ణయించారు.

BCCI: మాజీ ప్లేయర్లు, అంపైర్ల జీతాన్ని పెంచిన బీసీసీఐ

Bcci Pension

 

 

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అంపైర్లు, ఆటగాళ్ల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ అనంతరం రెట్టింపు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గేమ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం పెన్షన్ పెంచాలని నిర్ణయించారు.

రివైజ్ చేసిన మానిటరీ పాలసీల ప్రకారం.. గతంలో రూ.15వేల పొందే ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లకు ఇప్పుడు రూ.30వేలు లభిస్తుండగా, రూ.37వేల 500 పొందే మాజీ టెస్టు ఆటగాళ్లకు ఇప్పుడు రూ.60వేలు, రూ.50వేలు పెన్షన్ ఉన్నవారికి రూ.70వేలు లభిస్తాయి.

ఈ రివైజ్‌డ్ పాలసీలు పురుషుల విభాగానికి మాత్రమే కాకుండా, మహిళల విభాగానికి కూడా సరిచేశారు. రూ.30వేలు పొందిన మహిళా అంతర్జాతీయ క్రీడాకారులు ఇక నుంచి రూ.52వేల 500 అందుకోనున్నారు. 2003కి ముందు పదవీ విరమణ చేసి రూ. 22వేల500 పొందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఇప్పుడు రూ. 45వేలు పొందుతారని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.

Read Also : ఐపీఎల్ గ్రౌండ్స్‌మెన్‌కు రూ.1.25 కోట్ల నజరానా : బీసీసీఐ ప్రకటన

జే షా ఒక ట్వీట్‌లో “మాజీ క్రికెటర్లు, మ్యాచ్ అధికారుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. దాదాపు 900 మంది సిబ్బంది ఈ ప్రయోజనాన్ని అందుకోనున్నారు. దాదాపు 75% మంది సిబ్బంది లబ్ధిదారులుగా ఉంటారు” అని వివరించారు.

ఈ విషయంపై బీసీసీఐ చీఫ్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేస్తూ, “మాజీ క్రికెటర్ల ఆర్థిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి. ఆటగాళ్లు లైఫ్‌లైన్‌గా ఉంటారు. వారి పక్కన ఉండటం మన కర్తవ్యం. ఆటకు అంపైర్ అందించిన సహకారాన్ని ప్రశంసిస్తూ గంగూలీ అంపైర్లు హీరోలు BCCI వారి సహకారానికి నిజంగా విలువనిస్తుంది” అని అన్నాడు.