BCCI: రోహిత్ సేనకు గుడ్ న్యూస్.. భారీ క్యాష్ రివార్డు ప్రకటించిన బీసీసీఐ.. ఎంతంటే? క్రికెటర్లతోపాటు వారికి కూడా

ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.

Team India

Team India: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ సేనకు శుభవార్త చెప్పింది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత్ జట్టు దుబాయ్ వేదికగా టోర్నీలో మ్యాచ్ లు ఆడింది. అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధించిన రోహిత్ సేన.. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై ఘన విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది.

Also Read: IPL 2025: రోహిత్ శర్మతో ఓపెనర్ గా వచ్చేది ఎవరు..? మీడియా ప్రశ్నకు హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. మా జట్టులో ముగ్గురు కెప్టెన్లు..

ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ మొత్తంలో క్యాష్ ఫ్రైజ్ ను ప్రకటించింది. ట్రోపీలో ఆడిన భారత క్రికెటర్లకు రూ.58కోట్ల క్యాష్ ప్రైజ్ ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. క్యాష్ ఫ్రైజ్ అందుకునేవారిలో క్రికెటర్లతోపాటు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీ సభ్యులు ఉంటారు.

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో బుమ్రా ఈ మ్యాచుల్లో ఆడడా? కోచ్ జయవర్దనే ఏమన్నారంటే?

అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా అంకితభావానికి, ఉత్తమ ఆటతీరుకు క్యాష్ రివార్డు సంకేతమని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తెలిపారు. ప్రతిఒక్కరి కష్టానికి నగదు నజరానా గుర్తింపు వంటిదన్నారు. 2025 సంవత్సరంలో ఇది రెండో ఐసీసీ ట్రోఫీ అని రోజర్ బిన్నీ గుర్తుచేశారు. అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచినట్లు చెప్పారు.

 

ఇదిలాఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టింది. అన్నిజట్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఫైనల్ కు చేరుకునే క్రమంలో నాలుగు ఘన విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై 44 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా టోర్నీ విజేతగా నిలిచింది.

ఇదిలాఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.19.50కోట్ల వరకు ఐసీసీ నుంచి ఫ్రైజ్ మనీ లభించిన విషయం తెలిసిందే. ఫైనల్ లో ఓటమి పాలైన న్యూజిలాండ్ జట్టుకు రూ.9.70కోట్ల వరకు లభించాయి. అయితే, ప్రస్తుతం బీసీసీఐ భారత్ జట్టుకు రూ.58కోట్లను క్యాష్ రివార్డుగా అందించనుంది.