BCCI : ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. SRH vs MI మ్యాచ్‌లో మార్పులు..!

ఉగ్ర‌దాడి బాధితుల‌కు నివాళిగా బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Courtesy BCCI

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి పాల్ప‌డ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంత్ నాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులు జ‌రిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సైనిక దుస్తుల్లో వ‌చ్చిన‌ ముష్క‌రులు.. ఇద్ద‌రు విదేశీయులతో పాటు మొత్తం 28 మందిని చంపేశారు. దీంతో యావ‌త్ దేశంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ఉగ్ర‌దాడి బాధితుల‌కు నివాళిగా బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

LSG vs DC : మెంటర్ జ‌హీర్ ఖాన్‌తో రిష‌బ్ పంత్ వాగ్వాదం..! వీడియో వైర‌ల్‌

బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్‌లో బాణా సంచాకాల్ప‌డం, చీర్ లీడ‌ర్ల డ్యాన్స్ ఉండ‌వ‌ని తెలిపింది. ఏఎన్ఐ నివేదిక ప్ర‌కారం.. ముంబై, స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌తో పాటు అంపైర్లు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించ‌నున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మృతులకు నివాళులర్పించడానికి ఒక నిమిషం మౌనం కూడా పాటించనున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ప్లేఆఫ్స్‌లో బ‌రిలో నిల‌వాలంటే ముంబై ఇండియ‌న్స్ పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం. స‌న్‌రైజ‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లు ఖాతాలో ఉండ‌గా నెట్ ర‌న్‌రేట్ -1.217గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.

KL Rahul : ల‌క్నో పేరు ప్ర‌స్తావిస్తూ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ పోస్ట్.. వైర‌ల్‌

మ‌రోవైపు వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు గెలిచి జోష్‌లో ఉంది ముంబై ఇండియ‌న్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 8 మ్యాచ్‌లు ఆడ‌గా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. మ‌రో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో ఎనిమిది పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.483గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

ఉప్ప‌ల్ స్టేడియం బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామం కావ‌డంతో భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.