LSG vs DC : మెంటర్ జహీర్ ఖాన్‌తో రిషబ్ పంత్ వాగ్వాదం..! వీడియో వైరల్
లక్నో డగౌట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు దారుణంగా విఫలం అయ్యాడు. మెగావేలంలో రూ.27 కోట్లు దక్కించుకున్న ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఏడో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో పంత్ రావడాన్ని క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. పంత్ కాస్త బ్యాటింగ్ ఆర్డర్ లో నాలుగు లేదా ఐదో స్థానంలో వచ్చి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదన్నారు.
KL Rahul : లక్నో పేరు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ పోస్ట్.. వైరల్
Zaheer pant bahas pic.twitter.com/EAbroEQDOJ
— Pappu Plumber (@tappumessi) April 22, 2025
కాగా.. లక్నో డగౌట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లక్నో ఇన్నింగ్ సమయంలో పంత్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్యాడ్లు, హెల్మెట్ ధరించి మెంటార్ జహీర్ పక్కన కూర్చుని ఉన్నాడు. జహీర్‌తో అతడు ఏదో విషయం పై వాదించినట్లుగా కనిపిస్తోంది.
ఇక మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. తాము ఈ మ్యాచ్‌లో 20 పరుగులు తక్కువగా చేశామని చెప్పుకొచ్చాడు. ఈ వికెట్ పై ముందుగా బౌలింగ్ చేసిన వారికి మంచి సాయం దొరుకుతుందన్నాడు. రెండో ఇన్నింగ్స్ అప్పుడు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్నాడు. మొత్తంగా టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. అలాగని టాస్ ఓడిపోవడంతోనే తాము మ్యాచ్ ఓడిపోయామని చెప్పడం లేదన్నాడు.
పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోవాలనే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినట్లుగా వెల్లడించాడు. అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ ఆడతాడని భావించి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించామన్నాడు. ఆ తరువాత మిల్లర్‌ను బరిలోకి దించామన్నాడు. మయాంక్ యాదవ్ లేకపోవడంతో ఆయుష్ బదోనిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించామని పంత్ చెప్పాడు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పంత్ 8 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 106 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది.