KL Rahul : లక్నో పేరు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ పోస్ట్.. వైరల్
కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందింది. ఢిల్లీ విజయంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం అతడు తన మాజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
గత సీజన్‌లో తనను అవమానించిన గోయెంకాకు రాహుల్ గట్టి బుద్ధి చెప్పాడని నెటిజన్లు అంటున్నారు. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మ్యాచ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. లక్నోలో తిరిగి పుంజుకోవడం ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతి అని రాసుకొచ్చాడు.
SRH vs MI : 300 లోడింగ్.. ముంబైతో సన్‌రైజర్స్ మ్యాచ్ నేడే.. పిచ్ ఎవరికి అనుకూలం?
ఈ క్రమంలో నెటిజన్లు, అభిమానులు మెగావేలానికి ముందు కేఎల్ రాహుల్‌పై సంజీవ్ గోయెంకా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన మాటలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఇందుకు రాహుల్ సైతం ధీటుగా బదులు ఇచ్చాడు.
View this post on Instagram
సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ.. ప్లేయర్లలో గెలవాలనే తపన ఉండాలన్నాడు. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆకాంక్షల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం అనుకునే వారితో కలిసి ఉండటం మంచిదని చెప్పాడు. అలాంటి వారినే రిటైన్ చేసుకోవాలని అనుకుంటామని తెలిపాడు.
ఇందుకు రాహుల్ ప్రతి స్పందించాడు. నిర్ణయాన్ని వారు ఎప్పుడో తీసుకున్నారు. మేనేజ్‌మెంట్ ఏమన్నదో నాకు తెలియదు. ఇక నుంచి కొత్తగా ప్రయాణం మొదలుపెడుతా. నాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ దొరికే వాతావరణంలో ఆడతా. ఐపీఎల్‌లో ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్నింటిని వదిలి వేసి ముందుకు వెళ్లడమే మంచిది. అదే మనకు కూడా మంచిది అని రాహుల్ అన్నాడు.