Big shock to Australia Adam Zampa and Josh Inglis to miss IND vs AUS 1st ODI
IND vs AUS : వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది.
ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌లకు సంబంధించిన జట్లను భారత్, ఆస్ట్రేలియాలు ప్రకటించాయి. అయితే.. తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు జోష్ ఇంగ్లిస్, ఆడమ్ జంపాలు తొలి వన్డేకు దూరం అయ్యారు. వారి స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్‌లను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.
Shai Hope : 2967 రోజుల తరువాత టెస్టుల్లో షై హోప్ సెంచరీ.. వెస్టిండీస్ తరుపున ఆల్‌టైమ్ రికార్డు..
తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో జంపా న్యూ సౌత్ వేల్స్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అతడు రెండు, మూడో వన్డేల కోసం తిరిగి జట్టులో చేరనున్నాడు. ఇక ఇంగ్లిష్ విషయానికి వస్తే.. కాలి కండరాల గాయం నుంచి అతడు ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలోనే అతడు తొలి వన్డేకు దూరం అయ్యాడు.
ఆస్ట్రేలియా ఫస్ట్-ఛాయిస్ కీపర్ అలెక్స్ కారీ వన్డే సిరీస్ ఎంపికైనప్పటికి కూడా యాషెస్ సిరీస్ సన్నద్ధం కోసం అతడు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడేందుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కారీ వన్డే సిరీస్‌కు దూరం అయితే.. ఫిలిప్ వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్..
భారత్‌తో తొలి వన్డేకు ఆసీస్ జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – అక్టోబర్ 19 (పెర్త్)
* రెండో వన్డే – అక్టోబర్ 23 (అడిలైడ్)
* మూడో వన్డే – అక్టోబర్ 25 (సిడ్ని)