Shai Hope : 2967 రోజుల తరువాత టెస్టుల్లో షై హోప్ సెంచరీ.. వెస్టిండీస్ తరుపున ఆల్‌టైమ్ రికార్డు..
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షై హోప్ సెంచరీ చేశాడు.

IND vs WI 2nd Test Shai Hope scores Test century after 2967 days
Shai Hope : ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు షై హోప్ సెంచరీ చేశాడు. 204 బంతుల్లో ఈ విండీస్ వీరుడు మూడు అంకెల స్కోరు సాధించాడు. మొత్తంగా 214 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 103 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కాగా.. టెస్టుల్లో అతడికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. దాదాపు 8 ఏళ్ల తరువాత అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. చివరి సారిగా అతడు 2017లో ఇంగ్లాండ్ పై శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో షై హోప్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
Smriti Mandhana : భారత్ మ్యాచ్ ఓడిపోయినా.. స్మృతి మంధాన ప్రపంచ రికార్డులు..
రెండు టెస్టు సెంచరీల మధ్య అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన విండీస్ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. గతంలో జెర్మైన్ బ్లాక్‌వుడ్ పేరిట ఈ రికార్డు ఉండేది. జెర్మైన్ బ్లాక్‌వుడ్ రెండు టెస్టు సెంచరీ మధ్య 47 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక షై హోప్ విషయానికి వస్తే.. అతడు 58 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్, డ్వేన్ బ్రావో, శివనారాయణ్ చంద్రపాల్ సైతం ఉన్నారు.
వెస్టిండీస్ తరపున రెండు టెస్ట్ సెంచరీల మధ్య అత్యధిక ఇన్నింగ్స్‌లు
* షై హోప్ – 58 ఇన్నింగ్స్‌లు (2017-25)
* జెర్మైన్ బ్లాక్‌వుడ్ – 47 ఇన్నింగ్స్‌లు (2015-20)
* క్రిస్ గేల్ – 46 ఇన్నింగ్స్‌లు (2005-08)
* డ్వేన్ బ్రావో – 44 ఇన్నింగ్స్‌లు (2005-09)
* శివనారాయణ్ చంద్రపాల్ – 41 ఇన్నింగ్స్ (1998-2002)
రిచర్డ్‌సన్‌ను అధిగమించిన షైహోప్..
అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ తరుపున అన్ని ఫార్మాట్లలో కలిసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రిచర్డ్‌సన్‌ను షై హోప్ అధిగమించాడు. రిచర్డ్ సన్ 21 సెంచరీలు చేయగా.. తాజా శతకం హోప్‌కు 22వ కావడం విశేషం. ఈ జాబితాలో హోప్ 7వ స్థానంలో ఉన్నాడు. 53 శతకాలతో తొలి స్థానంలో బ్రియాన్ లారా ఉన్నాడు.
విండీస్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* బ్రియన్ లారా – 53 సెంచరీలు
* క్రిస్ గేల్ – 42 సెంచరీలు
* శివనారాయణ్ చంద్రపాల్ – 41 సెంచరీలు
* వివ్ రిచర్డ్స్ – 35 సెంచరీలు
* డెస్మండ్ హేన్స్ – 35 సెంచరీలు
* గోర్డాన్ గ్రీనిడ్జ్ – 30 సెంచరీలు
* షై హోప్ – 22 సెంచరీలు
* రిచీ రిచర్డ్‌సన్ – 21 సెంచరీలు