Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోపీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఐదు టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా 3-1 ఆధిక్యంతో ట్రోపీని గెలుచుకుంది. సిడ్నీలో ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన తరువాత విజేత జట్టుకు ట్రోపీని అందజేశారు. అయితే, ఈ ట్రోఫీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ చేతుల మీదుగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుకున్నాడు. ట్రోఫీని ఇస్తున్న సమయంలో గావస్కర్ మైదానంలో వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. ట్రోఫీని అందించే సమయంలో ఆస్ట్రేలియా సునీల్ గావస్కర్ ను పట్టించుకోలేదు. కేవలం బోర్డర్ చేతుల మీదుగానే ఈ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు అందించడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: Gambhir: రోహిత్-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఏమన్నాడంటే?
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ (Allan Border), దిగ్గజ భారత బ్యాటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) పేర్లుమీద బోర్డర్ -గావస్కర్ ట్రోఫీని 1996 – 1997 సీజన్ నుంచి ఐసీసీ అందజేస్తోంది. యాషెస్ సిరీస్ మాదిరిగానే ఇది అభిమానులను ఆకట్టుకుంది. అయితే, తాను లేకుండా తన తోటి ఆటగాడు అలన్ బోర్డర్ తో ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీని అందజేయడం పట్ల సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్ తో కలిసి ట్రోఫీని అందజేసేందుకు తనకు ఆహ్వానం లేకపోవటం నిరుత్సాహానికి గురిచేసిందని, తనతో కలిసి ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీని అందజేసే అవకాశం కల్పిస్తే సంతోషించేవాడినని గావస్కర్ పేర్కొన్నారు.
Also Read: IND vs AUS: చేతులెత్తేసిన టీమిండియా.. ఐదో టెస్టులోనూ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా
నేను కేవలం భారతీయుడిని కాబట్టి పిలవలేదేమోనని గావస్కర్ అన్నారు. ఆస్ట్రేలియా జట్టు సిరీస్ ను కైవసం చేసుకోవటం పట్ల నేనూ సంతోషిస్తాను. ఎందుకంటే వారు బాగా ఆడారు. టోర్నీ గెలుచుకోవటానికి వారు అర్హులే. అయితే, సిడ్నీ లో టెస్టు ప్రారంభానికి ముందు టోర్నీ నిర్వాహకులు తనకు వద్దకు వచ్చారు. మ్యాచ్ అనంతరం ట్రోఫీ అందజేతపై వారి అభిప్రాయాన్ని తెలిపారు. అదేమిటంటే.. ఒకవేళ సిడ్నీ టెస్టులో మ్యాచ్ డ్రా అయినా, ఆస్ట్రేలియా గెలిచినా ట్రోఫీని అందజేయడానికి మీ అవసరం ఉండదని చెప్పారు. నేను అయోమయానికి గురయ్యా. ఎందుకంటే.. ఇది బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ కదా. అదీకాక.. నేను మైదానంలోనే ఉన్నాను. కానీ, ట్రోఫీ ఇచ్చే సమయంలో తనకు ఆహ్వానం ఇవ్వలేదు. బోర్డర్, నేను కలిసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తే బాగుండేదని అనిపించిందని గావస్కర్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. రెండురోజుల క్రితం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. అలన్ బోర్డర్ తో తనకున్న బంధాన్ని తెలిపాడు. నాకు బోర్డర్ అంటే చాలా ఇష్టం. 1987లో ఎంసీసీ ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా మేమిద్దరం రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టీమ్ వర్సెస్ ఎంసీసీ కోసం ఆడాం. అప్పుడు మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. ఎంసీసీతో ఆటకు ముందు మేము కలిసి మూడు వారాలు కలిసి ప్రయాణించాం. కౌంటీతో కొన్ని మ్యాచ్ లు ఆడాం. మేము మంచి స్నేహితులుగా మెలిగాం. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిరీస్ కు మా పేరు పెట్టడం గౌరవంగా భావిస్తాను అని గవాస్కర్ అన్నారు.
It was a 10-year wait but worth it 🏆#WTC25 | #AUSvIND pic.twitter.com/omPX93kX8d
— ICC (@ICC) January 5, 2025