ENG vs IND : ఇంగ్లాండ్‌లో ఇంతే భ‌య్యా.. 430 ప‌రుగులు చేస్తే.. షాంపైన్ బాటిల్ చేతిలో పెట్టారు.. కాస్ట్ ఎంతో తెలిస్తే ప్యూజులు ఔట్‌..

రెండో టెస్టులో శుభ్‌మ‌న్ గిల్ 430 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

ENG vs IND 2nd Test Team India Captain Shubman Gill with POTM award

అండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజ‌యంలో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశ‌త‌కం (269) బాదిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో (161) భారీ శ‌త‌కాన్ని చేశాడు. మొత్తంగా మ్యాచ్‌లో 430 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

భార‌త్‌లో అయితే.. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న వారికి స్పాన్స‌ర్లు పెద్ద మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంటారు. అయితే.. ఇంగ్లాండ్‌లో మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇక్క‌డ మ‌ద్యం లేదా షాంపైన్ బాటిళ్ల‌ను బ‌హుమ‌తిగా అందిస్తూ ఉంటారు.

Virender Sehwag : అయ్యో పాపం సెహ్వాగ్‌.. విచిత్ర ప‌రిస్థితి.. ఓ కుమారుడు అలా, మ‌రో కుమారుడు ఇలా..

ఇక రెండో టెస్టులో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన గిల్‌కు కూడా ఇలాంటి బ‌హుమ‌తినే ఇచ్చారు. షాంపైన్ బాటిల్‌ను అందించారు. దీని విలువ రూ.21వేలుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

గిల్ అద్భుత ఇన్నింగ్స్‌లతో పాటు ఆకాశ్ దీప్ (10 వికెట్లు) ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా భార‌త్ రెండో టెస్టులో 336 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెల‌వ‌డంతో ప్ర‌స్తుతానికి సిరీస్ 1-1తో స‌మ‌మైంది. ఇక కీల‌క‌మైన మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదిక‌గా జూలై 10 నుంచి 14 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ ఎంత ప‌ని చేశావ‌య్యా.. నీ ఒక్క‌డి వ‌ల్ల బీసీసీఐకి రూ.250 కోట్ల న‌ష్టం?

వ‌ర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టుకు దూర‌మైన జ‌స్‌ప్రీత్ బుమ్రా మూడో టెస్టులో ఆడ‌నున్న‌ట్లు రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ గిల్ చెప్పాడు. ఇక లార్డ్స్‌లో ఆడేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు. లార్డ్స్‌లో మ్యాచ్ ఆడాల‌ని ప్ర‌తి క్రికెట‌ర్ కోరుకుంటాడ‌ని, అలాంటి చోట జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌నుండ‌డం ఎంతో గొప్ప గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు తెలిపాడు.