Virender Sehwag : అయ్యో పాపం సెహ్వాగ్.. విచిత్ర పరిస్థితి.. ఓ కుమారుడు అలా, మరో కుమారుడు ఇలా..
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్ పాట్ కొట్టాడు.

Virender Sehwag elder son sold younger son unsold in IPL 2025
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్ పాట్ కొట్టాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని ఏకంగా రూ.8లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. తన తండ్రిలాగానే ఓపెనర్ అయిన 17 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ తరుపున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు.
కాగా.. ఈ వేలంలో సెహ్వాగ్ చిన్నకుమారుడు వేదాంత్‌కు నిరాశే ఎదురైంది. అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ అంశంపైన అయినా ఫన్నీగా స్పందించే సెహ్వాగ్ ఇప్పుడు ఎలా స్పందిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కోహ్లీ మేనల్లుడు, లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్‌ను ఢిల్లీ రంజీ ట్రోఫీ కెప్టెన్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆయుష్ బదోని నాయకత్వం వహించే సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జట్టు తీసుకుంది. అతడిని ఒక లక్షకు కొనుగోలు చేసింది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేసర్ సిమర్జీత్ సింగ్ నిలిచాడు. అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆఖరికి సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.39లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రెండో అత్యధిక మొత్తం పొందిన ఆటగాడిగా నిలిచాడు. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ రూ.38లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఆర్ఆర్ ఆటగాడు నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ రూ.34లక్షలకు కొనుగోలు చేసింది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ ఎంత పని చేశావయ్యా.. నీ ఒక్కడి వల్ల బీసీసీఐకి రూ.250 కోట్ల నష్టం?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ లు ఆడగా.. రెండో సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ వచ్చి చేరాయి.