Virat Kohli : కోహ్లీకి షాక్.. వన్ 8 కమ్యూన్ పై కేసు..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది.

Case Against Virat Kohli Restaurant One8 Commune
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. అతడికి చెందిన పబ్ పై కేసు నమోదైంది.
బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డులో వన్8 కమ్యూన్ ఉంది. ఇందులో పబ్, రెస్టారెంట్ ఉంది. దీనికి కోహ్లీ యజమాని. దీనిపై సుమోటాగా కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెస్టారెంట్‌లో స్మోకింగ్ జోన్ లేకపోవడంతో కోట్పా చట్టం కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
Preity Zinta : కన్నుగీటిన ప్రీతి జింటా.. ఆ యువఆటగాడిని చూసేనా?
కాగా.. కోహ్లీకి చెందిన ఈ క్లబ్ పై కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచడంతో గతేడాది జూలైలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక డిసెంబర్ 2024లో ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
విరాట్ కోహ్లీ సహ యాజమాన్యంలోని ప్రీమియం హాస్పిటాలిటీ చైన్‌లో వన్8 కమ్యూన్ భాగం. దీనికి ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, బెంగళూరులో అవుట్‌లెట్‌లు ఉన్నాయి.