PV Sindhu: పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం.. సీఎం జగన్ ఆదేశం

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో సత్తాచాటిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్, విశ్వ పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం అందజేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు రూ.30లక్షల నగదు ప్రోత్సాహకం అందించాలంటూ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

PV Sindhu: పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం.. సీఎం జగన్ ఆదేశం

Jagan

Updated On : August 3, 2021 / 11:25 AM IST

Pv Sindhu: టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో సత్తాచాటిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్, విశ్వ పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం అందజేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు రూ.30లక్షల నగదు ప్రోత్సాహకం అందించాలంటూ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సింధుతోపాటు వివిధ అంతర్జాతీయ, జాతీయ క్రీడా వేదికలపై పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.

రెండు పర్యాయాలు వరుసగా పతకాలు సాధించి ఒలింపిక్స్ మెడల్స్‌ను రాష్ట్రానికి తీసుకుని వచ్చి సింధు చరిత్ర సృష్టించిందని ముఖ్యయంత్రి జగన్ కొనియాడారు. సింధు విజయాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతిభ ఉన్న, క్రీడల్లో రాణిస్తున్న రాష్ట్ర క్రీడాకారులందరినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ సంధర్భంగా జగన్ చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం వారిని గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందజేయాలని సీఎం సూచించారు.

టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లేముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం అందించి. 2017–22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.