Afghanistan : సెమీస్‌కు చేరిన అఫ్గానిస్తాన్‌.. దేశంలో అంబ‌రాన్ని అంటిన సంబ‌రాలు.. వేల సంఖ్య‌ల్లో వీధుల్లోకి వ‌చ్చిన ఫ్యాన్స్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్తాన్ అద్భుతం చేసింది.

Afghanistan : సెమీస్‌కు చేరిన అఫ్గానిస్తాన్‌.. దేశంలో అంబ‌రాన్ని అంటిన సంబ‌రాలు.. వేల సంఖ్య‌ల్లో వీధుల్లోకి వ‌చ్చిన ఫ్యాన్స్‌..

Celebrations Erupt In Afghan Cities After World Cup Heroics

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో అఫ్గానిస్తాన్ అద్భుతం చేసింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆ జ‌ట్టు సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అఫ్గాన్ సెమీస్‌కు చేరుకోవ‌డం ఇదే తొలిసారి. దీంతో మైదానంలో అఫ్గాన్ ఆట‌గాళ్లంతా భావోద్వేగానికి లోనైయ్యారు.

కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మైదానంలో మోకాళ్ల‌పై కూర్చొని ఆనంద భాష్పాల‌ను రాల్చాడు. కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌, బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో కూడా అఫ్గాన్‌ గెలుపు సంబరాల్లో భాగమయ్యారు. ఇక‌ టీమ్ బ‌స్సులో వెళ్తున్న స‌మ‌యంలోనూ అఫ్గాన్‌ క్రికెట‌ర్లు కూడా పార్టీ చేసుకున్న‌ట్లు కొన్ని వీడియోలు వ‌చ్చాయి.

AFG vs BAN : స‌రిపోయారు.. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. అఫ్గాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కామెడీ ఎర్ర‌ర్‌..

ఇక అఫ్గానిస్తాన్ సెమీస్ చేర‌డంతో ఆ దేశంలోని క్రికెట్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. వేల సంఖ్య‌ల్లో వీధుల్లో ర్యాలీ తీశారు. వారి సంబ‌రాలు, భావోద్వేగాలు మాట్ల‌ల్లో వ‌ర్ణించ‌లేని విధంగా ఉన్నాయి. అఫ్గాన్ దేశ వీధుల‌న్నీ ప్లేయ‌ర్ల నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిపోయాయి. కాబూల్‌తో పాటు దేశంలోని ప్ర‌తి న‌గ‌రంలోనూ ప్ర‌జ‌లు రోడ్డ‌పైకి  వ‌చ్చి సంబ‌రాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ ర‌షీద్ ఖాన్ మాట్లాడుతూ.. త‌మ జీవిత క‌ల నెర‌వేరింద‌న్నాడు. ఈ ఆనంద స‌మ‌యంలో ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేద‌న్నాడు. త‌మ జ‌ట్టును చూస్తే ఎంతో గ‌ర్వంగా ఉంద‌న్నాడు. ప్ర‌తి ఒక్క ఆట‌గాడు త‌మ పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించార‌ని చెప్పుకొచ్చాడు. టోర్నీ ఆరంభంలో న్యూజిలాండ్‌ను ఓడించ‌డంతో త‌మ న‌మ్మ‌కం పెరిగింద‌న్నాడు. మిగిలిన మ్యాచుల్లోనూ ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌నే చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నాడు.

ఆఫ్ఘ‌న్ జ‌ట్టు స‌భ్యుల‌పై కెప్టెన్ ప్ర‌శంస‌లు కురిపించాడు. టీ20 లైన‌ప్ చాలా బ‌లంగా ఉంద‌న్నాడు.