AFG vs BAN : సరిపోయారు.. ఇద్దరూ ఇద్దరే.. అఫ్గాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కామెడీ ఎర్రర్..
టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై అఫ్గానిస్తాన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

T20 World cup 2024 Comedy of error in AFG vs BAN match
టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై అఫ్గానిస్తాన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా అఫ్గాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరగా బంగ్లాదేశ్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు ఇంటి ముఖం పట్టాయి. స్వల్ప లక్ష్యాన్ని అఫ్గాన్ బౌలర్లు చక్కగా కాపాడుకున్నారు.
ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43) టాప్ స్కోరర్. అతడితోపాటు ఇబ్రహీం జద్రాన్ (18), రషీద్ ఖాన్ (19 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.
రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. రికార్డులే రికార్డులు.. ఇవిగో వివరాలు
అనంతరం బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. బంగ్లా లక్ష్యాన్ని 114 పరుగులు నిర్ణయించారు. అఫ్గాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పేలవ ఫీల్డింగ్..
కాగా.. అఫ్గాన్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్ ఫీల్డర్ల పేలవ ఫీల్డింగ్ కారణంగా అతడు రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ వైపు గుర్భాజ్ షాట్ ఆడాడు. సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే బంతిని ఫీల్డర్ ఆపడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
రోహిత్ శర్మ పవర్‌ఫుల్ హిట్టింగ్.. రితిక రియాక్షన్ చూశారా?
మరో ఎండ్‌లో ఉన్న గుల్బాదిన్ నైబ్ అప్పటికే పరుగు ప్రారంభించాడు. ఇద్దరూ కూడా బ్యాటర్ ఎండ్ క్రీజు వైపుకు వచ్చారు. బాల్‌ను అందుకున్న ఫీల్డర్ బంతిని విసరగా అది వికెట్లను తాకలేదు. ఇంకొక ఫీలర్డ్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో మళ్లీ ఇద్దరు బ్యాటర్లు బౌలింగ్ ఎండ్ వైపుకు పరుగు ప్రారంభించారు. ఒకరికొకరు గట్టిగా అనుకుని గుర్భాజ్ బౌలింగ్ ఎండ్ వైపు పరిగెత్తాడు. గుల్బాదిన్ నైబ్ ఎండ్ వైపుకు వచ్చారు. దీంతో అఫ్గాన్‌కు ఒక్క పరుగు వచ్చింది. బంగ్లాదేశ్ ఫీల్డర్లు గనుక అప్రమత్తంగా ఉండి ఉంటే ఇన్నింగ్స్ రహ్మానుల్లా ఔట్ అయ్యేవాడు. అప్పుడు మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేదేమో.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాసికరం ఫీల్డింగ్‌తో బంగ్లాదేశ్ క్రికెటర్లు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఓ నెటిజన్ అనగా.. మీ కంటే గల్లీ ఫీల్డర్లు నయం అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
Comedy of errors!
Looked like, at one point, they were trying to race against each other to get to the crease ?#T20IWorldCup #AfgVsBan pic.twitter.com/Ha7kv473d8
— Gautham CB (@gauthamcb) June 25, 2024