Champions Trophy: ఆసీస్‌పై విక్టరీ తరువాత కోహ్లీ, రోహిత్ శర్మ ఏం చేశారో చూశారా.. వీడియో వైరల్ ..

ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది.

Virat Kohli and Rohit sharma

IND vs AUS: అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ (84 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్ కుతోడు చివరిలో హార్దిక్ పాండ్య(28), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) దూకుడుగా ఆడటంతో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్స్ లో నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు విజయం సాధించింది.

Also Read: Champions Trophy: ఆస్ట్రేలియాపై విజయం తరువాత రోహిత్ శర్మ కీలక కామెంట్స్.. కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read: IND vs AUS : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్‌.. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై ఘ‌న విజ‌యం..

35 ఓవర్లకు భారత్ స్కోర్ 178కి చేరింది. కోహ్లీ, రాహుల్ క్రీజులో ఉన్నారు. ఒక్కో పరుగు చేసుకుంటూ భారత్ జట్టును విజయం వైపుకు నడిపించారు. అయితే, 43వ ఓవర్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా వేసిన బంతిని అనవసర షాట్ ఆడి కోహ్లీ ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ జట్టు విజయానికి 40 పరుగుల దూరంలో ఉంది. కోహ్లీ ఔట్ తరువాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వరుస సిక్సర్లు కొట్టిన హార్దిక్.. 48వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికే టీమిండియా విజయం దాదాపు ఖాయమైంది. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో రాహుల్ సిక్స్ కొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో టీమిండియా ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి.

 

రాహుల్ సిక్స్ కొట్టగానే విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూం నుంచి బయటకు వచ్చి గంతులేశాడు. ఆ తరువాత రోహిత్ శర్మను అభినందిస్తూ కనిపించాడు. రోహిత్, కోహ్లీ, ఇతర టీం సభ్యులు ఆసీస్ పై విజయంతో సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.