Champions Trophy: ఆస్ట్రేలియాపై విజయం తరువాత రోహిత్ శర్మ కీలక కామెంట్స్.. కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ..

మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక సమయంలో తుది జట్టులో ఆరుగురు బౌలర్లు ఉండేలా..

Champions Trophy: ఆస్ట్రేలియాపై విజయం తరువాత రోహిత్ శర్మ కీలక కామెంట్స్.. కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ..

Rohit sharma

Updated On : March 5, 2025 / 7:06 AM IST

IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఫైనల్స్ కు చేరుకుంది. మంగళవారం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీఫైనల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Also Read: IND vs AUS : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్‌.. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై ఘ‌న విజ‌యం..

మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టు ఎంపిక సమయంలో తుది జట్టులో ఆరుగురు బౌలర్లు ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. అదేసమయంలో కింది స్థాయి వరకు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండాలని భావించాం. అలాగే జట్టును ఎంపిక చేశామని రోహిత్ చెప్పారు. అయితే, ఆస్ట్రేలియాపై విజయం అందరి సమిష్టి కృషి అన్నారు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. విరాట్ చాలా సంవత్సరాలుగా జట్టు కోసం ఆడుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ నుంచి పెద్ద భాగస్వామ్యాన్ని మేము ఆశించాం. విరాట్ కోహ్లీ (84 పరుగులు) రాణించాడు. ఆ తరువాత చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా దూకుడైన బ్యాటింగ్ తో జట్టు విజయానికి కీలక భూమిక పోషించాడని రోహిత్ కొనియాడారు. అయితే, ఫైనల్స్ లో తప్పక విజయం సాధిస్తామని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: IND vs AUS : చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఐసీసీ వన్డే టోర్నీల్లో ఒకే ఒక్క‌డు..

భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు అందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో అన్ని ఐసీసీ టోర్నీల్లో జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్ గా రికార్డు సాధించాడు. 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు భారత్ జట్టు చేరింది. అయితే, రోహిత్ కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలవగా.. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2023 వన్డే ప్రంపచ కప్ లో రన్నరప్ తో సరిపెట్టుకుంది.